Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monday Puja Tips: ఈరోజు శ్రావణ సోమవారం ఉపవాసం, పూజా విధానం, ప్రాముఖ్యతను తెలుసుకోండి..

అధిక మాసంలో శ్రావణ సోమవారం ఉపవాసం, పూజ మొదలైన వాటి గురించి చాలా మంది మనస్సులో  గందరగోళం ఉంది. ఈ మాసంలో చేసే పూజలకు ఫలితం ఉంటుందా..లేదా అని ఆలోచిస్తున్నారు. వాస్తవానికి అధిక శ్రావణ మాసం శ్రీ మహా విష్ణువు ఆరాధనకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే హిందువుల విశ్వాసం ప్రకారం ఈ అధిక మాసంలో ఏ శుభకార్యమూ చేయరాదు. అధిక మాసంలో శ్రావణ సోమవారం ఉపవాసం, పూజ మొదలైన వాటి గురించి చాలా మంది మనస్సులో  గందరగోళం ఉంది. ఈ మాసంలో చేసే పూజలకు ఫలితం ఉంటుందా..లేదా అని ఆలోచిస్తున్నారు.

Monday Puja Tips: ఈరోజు శ్రావణ సోమవారం ఉపవాసం, పూజా విధానం, ప్రాముఖ్యతను తెలుసుకోండి..
Follow us
Surya Kala

|

Updated on: Jul 31, 2023 | 11:33 AM

హిందూమతంలో శివుని ఆరాధనకు అత్యంత ఫలప్రదంగా భావించే సోమవారం.. మహాదేవునికి ప్రీతిపాత్రమైన మాసంలో వస్తే ఈ రోజు  ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. శివుడిని సోమవారం పూజించడం వల్ల ప్రసన్నుడై తన భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడని నమ్ముతారు. ఈ ఏడాది అధిక  శ్రావణ మాసం కారణంగా సోమవారాలు నాలుగు కాదు. రెండు నెలలకు కలిసి ఎనిమిది సోమవారాలు వచ్చాయి. పంచాంగం ప్రకారం అధిక శ్రావణ మాసంలో సోమవారం రోజున శివయ్యను పూజించడం వలన కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం..

అధిక మాసంలో శ్రావణ సోమవారం ఉపవాసం, పూజ మొదలైన వాటి గురించి చాలా మంది మనస్సులో  గందరగోళం ఉంది. ఈ మాసంలో చేసే పూజలకు ఫలితం ఉంటుందా..లేదా అని ఆలోచిస్తున్నారు. వాస్తవానికి అధిక శ్రావణ మాసం శ్రీ మహా విష్ణువు ఆరాధనకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే హిందువుల విశ్వాసం ప్రకారం ఈ అధిక మాసంలో ఏ శుభకార్యమూ చేయరాదు.

సోమవారం పూజా విధానం  హిందూ విశ్వాసం ప్రకారం అధిక మాసంలో ఏ శుభకార్యమూ చేయరు. అయితే పూజలు మాత్రం ఫలవంతమని విశ్వాసం. శ్రావణ సోమవారాలలో ఉపవాసం ఉన్నట్లయితే ఈ వ్రతాన్ని ఆచరించి శివుడిని పూజించాలి. అభిషేకం చేయడం అత్యంత ఫలవంతం.

ఇవి కూడా చదవండి

సోమవారం ఉపవాసం  సోమవార ఉదయాన్నే నిద్ర లేచి స్నానమాచరించి, ధ్యానం చేసిన తర్వాత ఇంటిలో ప్రతిష్టించిన శివలింగాన్ని గంగాజలంతో, ఆపై పచ్చి పాలు, నెయ్యి, తేనె, పెరుగు, పువ్వులు, అక్షత, బిల్వ పత్రాలు, జమ్మి ఆకులు, విభూది మొదలైన వాటితో పూజించండి. అనంతరం సోమవారం ఉపవాస కథను పఠించండి.  రుద్రాక్ష జపమాలతో శివుని మంత్రాన్ని జపించండి.  పూజ పూర్తి అయిన తర్వాత మహాదేవునికి హారతిని ఇవ్వండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)