- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti: Five Key Qualities in a Woman that Bring Fortune and Make a Husband Lucky in telugu
Chanakya Niti: ఈ ఐదు లక్షణాలున్న స్త్రీని పెళ్లి చేసుకున్న వ్యక్తి అదృష్టవంతుడు.. అన్నింటా విజయమే అంటున్న చాణక్య
రాజకీయం, నైతికతను పేర్కొన్న అతి పురాతన భారతీయ గ్రంథం చాణక్య నీతి. ఇందులో మనిషి నడవడిక, మానవ సంబంధాలను పొందుపరిచాడు ఆచార్య చాణక్య. అందులో భాగంగా స్త్రీలో ఈ ఐదు నిర్దిష్ట లక్షణాలు అదృష్టాన్ని తెస్తాయని ఆమె భర్తను అదృష్టవంతుడిని చేస్తాయని పేర్కొన్నాడు.. ఆచార్య చాణక్యుడు అని కూడా పిలువబడే చాణక్యుడు, చంద్రగుప్త మౌర్యుని సామ్రాజ్యాధినేతగా చేయడంలో ప్రముఖ పాత్రను పోషించాడు. అతని విధానాలు కాలాతీత జ్ఞానం కలిగి ఉన్నాయని..నేటికీ అనుసరణీయం అని నమ్ముతారు.
Updated on: Jul 30, 2023 | 11:03 AM

చాణక్యుడి నీతిలో స్త్రీ ప్రభావం పురుషుడి విజయానికి దోహదపడుతుందని.. ఆమె గుణాలు ఆమె భర్త ఆనందాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. ఈ లక్షణాలు కుటుంబంలో సుఖ, సంతోషాలతో ఉన్న వాతావరణాన్ని సృష్టిస్తాయి. స్త్రీకి ఈ ఐదు గుణాలు ఉంటే భర్త విజయం సాధిస్తాడని చాణక్యుడి చెప్పాడు.

సహనం అనే గుణం ఉన్న స్త్రీ తన భర్తకు ఎదురైన కష్టాల్లో, నష్టాల్లో అతనికి అండగా నిలుస్తుంది. సహనంతో భర్తకు ఎదురైన కష్టాలను అధిగమించడంలో సహాయపడుతుంది. బాధలు త్వరగా తీరిపోయేలా చేస్తుంది. అటువంటి సహనం కలిగిన స్త్రీ దొరికిన భర్త అదృష్టవంతుడు.

దేవుడి పట్ల భక్తివిశ్వాసాలను కలిగిన స్త్రీ .. భర్తకు అదృష్టవంతురాలిగా పరిగణించబడుతుంది. దేవుని పట్ల ఆమెకున్న విశ్వాసం, భక్తి భర్త అడుగుజాడలను నడిపిస్తుంది. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భార్య దారి తప్పకుండా ఈ గుణం కాపాడుతుంది. దేవుడిమీద భయ భక్తులున్న భార్య దొరికిన వ్యక్తి జీవితం శాంతివంతంగా ఉంది. సదా విజయాన్ని పొందుతాడు.

ప్రశాంతమైన ప్రవర్తన కలిగిన స్త్రీ తన కుటుంబంలో సానుకూల మార్పులను తెస్తుంది. ఆమె ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఎటువంటి పరిస్థితి ఎదురైనా తన ప్రశాంత చిత్తంతో దానిని ఎదుర్కొంటుంది. మితిమీరిన కోపం హానికరం కాబట్టి అనవసరమైన కోపాన్ని నివారించడం ప్రయోజనకరం.

చాణక్యుడు ప్రకారం మధురమైన, ఆహ్లాదకరమైన స్వరం ఉన్న స్త్రీ భార్యగా దొరికిన భర్తకు ఆశీర్వాదంగా పరిగణించబడుతుంది. ఆమె ఓదార్పు స్వరం, ప్రేమపూర్వక సంభాషణ వారి ఇంట్లో స్వర్గం లాంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది.

కోపాన్ని నియంత్రించుకునే గుణం కలిగిన స్త్రీని పెళ్లి చేసుకున్నభర్త జీవితం ఆనందంగా సాగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుని, ప్రకోపాలను నివారించడం సామరస్య సంబంధానికి దోహదం చేస్తుంది.

చాణక్యుడి నీతి సూచించినట్లుగా ఈ లక్షణాలు ఉన్న స్త్రీని పెళ్లి చేసుకున్న వ్యక్తి జీవితం సుఖ వంతంగా సాగుతుంది. వైవాహిక ధర్మాలను అవలంబించడం వల్ల భార్యాభర్తల మధ్య శాశ్వతమైన, ఆనందకరమైన భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుంది.





























