- Telugu News Photo Gallery Spiritual photos Astro vastu tips in telugu : agarbatti do not burn incense stick on these days otherwise bad luck will pooja time
Puja Tips: పొరపాటున కూడా ఈ 2 రోజులు అగరబత్తీలను వెలిగించవద్దు.. ఇంటికి దరిద్రం పడుతుంది..
సనాతన హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. పూజ సమయంలో మాత్రమే కాదు.. పండగలు, పర్వదినాలు, శుభ కార్యాలయాల్లో కూడా అగరబత్తీలను ఉపయోగిస్తారు. అంతేకాదు రోజువారీ పూజలో కూడా అగర్బత్తిలను వెలిగిస్తారు. అయితే వారంలో ఈ రెండు రోజులు ధూపం వేయడం వల్ల ఇంట్లో అనర్థాలు జరుగుతాయని మీకు తెలుసా. ఈ రోజు అగరబత్తీలను వెలిగించడంలో ఉన్న నియమాల గురించి తెలుసుకుందాం..
Updated on: Jul 30, 2023 | 10:36 AM

వాస్తు శాస్త్రం అగరుబత్తీలనువెలిగించడానికి అనేక నియమాలను పేర్కొంది. ఈ నియమం పాటించకపోతే దురదృష్టం వస్తుందని నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం వారంలో రెండు రోజులు ధూపం వేయకూడదు.

హిందూమతంలో పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దేవుడిని పూజించడానికి అందరూ ధూపం వేస్తారు. అగరుబత్తీలు వెలిగించడం వలన ఇంటిలోకి సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వారంలో రెండు రోజులు ధూపం వేయకూడదు.

ఏ రోజు ధూపం వేయకూడదంటే.. వాస్తు శాస్త్రం ప్రకారం ఆది, మంగళవారాల్లో అగరబత్తీలు వెలిగించకూడదు. ఎందుకంటే వెదురును అగరబత్తుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ రెండు రోజులలో వెదురును కాల్చడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది.

పురాణ గ్రంధాలలో వెదురు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. వెదురు మొక్క ఉన్న ఇంట్లో దరిద్రం ఉండదని నమ్మకం. వెదురుతో చేసిన అగర్బత్తిని వెలిగిస్తే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. దీంతో ఇంట్లో శాంతి, సామరస్యం దెబ్బతింటాయి.

ఈ విధంగా వెదురు మొక్కను అదృష్టమని భావిస్తారు కానీ వెదురుతో చేసిన అగర్బత్తిని కాల్చడం వల్ల మానసికంగా, ఆర్థికంగా నష్టపోతారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తుంది. కనుక అగరబత్తీలు వెలిగించే ముందు మీరు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.

వాస్తు శాస్త్రంలో వెదురు వంశానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. కాబట్టి దానిని కాల్చడం వలన అదృష్టాన్ని, వంశాన్ని కోల్పోతారు. అంతేకాదు హిందూ మతంలో ధూపం తయారీలో కూడా వెదురును ఉపయోగిస్తారు. అందుచేత వెదురుతో చేసిన వస్తువులతో అంటే అగరబత్తీలతో ధూపం వేయడం నిషిద్ధం.

హిందూమతంలో కుజుడికి వెదురుకి సంబంధం ఉంది. అందువల్ల, వెదురుతో తయారు చేసిన అగరబత్తీలను వెలిగించడం హిందూ మతంలో శుభప్రదంగా పరిగణించబడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, పూజ సమయంలో అగరబత్తీలతో వేసే ధూపానికి బదులుగా ధూపం ఉపయోగించవచ్చు.





























