AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో శాంతి పెంచే వాస్తు చిట్కాలు ! చిన్న మార్పులతో పెద్ద ఫలితాలు !

ఇంటి వాస్తు దోషాలను సరిచేయడానికి పెద్ద మార్పులు అవసరం లేదు. కొన్ని చిన్న మార్పులు చేయడం, వాస్తు శాస్త్రానికి అనుగుణంగా వాటిని అమర్చడం ఇంట్లో శాంతిని పెంచడంలో సహాయపడుతుంది. కిచెన్ లో సరైన లైటింగ్ అమర్చడం, మెయిన్ ఎంట్రెన్స్ వద్ద గుర్రపుడెక్కను ఉంచడం, ఇంట్లో స్ఫటికాలు ఉపయోగించడం వాస్తు శాస్త్రం ప్రకారం మంచిది. ఈ మార్పులు ఇంట్లో శక్తిని సమతుల్యంగా ఉంచి ప్రతికూల శక్తిని తగ్గించడానికి సహాయపడతాయి. అంతే కాదు ఇంటిలో శాంతి, ఆనందం, శ్రేయస్సు పెరిగేలా చేస్తాయి.

ఇంట్లో శాంతి పెంచే వాస్తు చిట్కాలు ! చిన్న మార్పులతో పెద్ద ఫలితాలు !
House With Vastu
Prashanthi V
|

Updated on: Jan 15, 2025 | 9:12 PM

Share

ఇంటి వాస్తు మార్పులు చేసుకోవాలంటే పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని చిన్న చిన్న మార్పులను ఫాలో అయితే చాలు. ఈ మార్పులను పాటించడం ద్వారా మీరు వాస్తు దోషాలను నివారించవచ్చు. అనేక సందర్భాల్లో వాస్తు దోషాల వల్ల మన ఇంటిలో సమస్యలు, ఆందోళనలు, మానసిక ఒత్తిడి తలెత్తి మన జివితం చుట్టూ గందరగోళం ఏర్పడుతుంది. దీని ప్రభావం మన ఆనందాన్ని, ప్రశాంతతను క్రమంగా తగ్గిస్తుంది. అయితే ఈ వాస్తు సమస్యలను పరిష్కరించడానికి చాలా సరళమైన పద్ధతులు ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోండి. ఇంటిలో వాస్తు శాస్త్రానికి అనుగుణంగా చేయవలసిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కిచెన్ లో లైటింగ్

వాస్తు శాస్త్రం ప్రకారం.. కిచెన్ గోపురపు దిశలో ఉండడం అనేది శుభకరం. అయితే కిచెన్ లో సరైన వెలుగులు ఉండటం కూడా చాలా ముఖ్యం. కొన్ని వాస్తు దోషాలను నివారించడానికి మీ కిచెన్ లో బల్బులను అమర్చడం అనేది మంచిది. అయితే కిచెన్ లో ట్యూబ్ లైట్లు ఉపయోగించడం కంటే బల్బులను ఉపయోగించండి. ఈ మార్పు వల్ల కిచెన్, ఇంట్లోని ఇతర భాగాలలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది.

మెయిన్ ఎంట్రన్స్ వద్ద గుర్రపుడెక్క

ఇంట్లో ఆనందం, శాంతి కోసం, ప్రధాన ద్వారం వద్ద గుర్రపుడెక్కను ఉంచడం చాలా శుభమని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ పరిష్కారాన్ని పాటించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా కాపాడుతుంది. గర్రపుడెక్కను రెడ్ కలర్ క్లాత్ లో ఉంచి ఎంట్రన్స్ వద్ద పైన ఉంచడం మంచిది. మీరు వస్తూ వెళ్తూ ఉంటే తగలకుండా సెట్ చేసుకోండి.

ఇంట్లో స్ఫటికాలు

ఇంట్లో శారీరక, మానసిక శాంతి కోసం స్ఫటికాలు ఉపయోగించడం ఎంతో ఫలప్రదంగా ఉంటుంది. వాస్తు శాస్త్రంలో స్ఫటికాలను ప్రతికూల శక్తిని తగ్గించడానికి చాలా ప్రభావవంతమైన పద్ధతిగా సూచించారు. స్ఫటికాలు శక్తి సామర్థ్యం కలిగివుండి, మీ ఇంటి అంతటా మంచి శక్తిని వ్యాప్తి చేస్తాయి. మీరు ఇంట్లో స్ఫటికాపు రాళ్లు లేదా క్రిస్టల్స్ ఉండేలా చూసుకోండి. ఇవి ఇంట్లో శాంతిని సానుకూల వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతాయి.

వాస్తు దోషాలను సరి చేయడం ఎలా ?

ఇంటి వాస్తు దోషాలను సరిచేయడానికి పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న మార్పులు, దిశలను సరిగా అమర్చడం, పరికరాలను బాగా ఏర్పాటు చేయడం ద్వారా కూడా మీ ఇంట్లో శాంతిని పొందవచ్చు. కొన్నిసార్లు ఇంట్లోని వస్తువులను సరిగ్గా అమర్చడం, వాటిని సరిగ్గా ఉంచడం ద్వారా మీ ఇంట్లో శాంతి నెలకొంటుంది.

వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఇల్లు

ఇంట్లో మెయిన్ ఎంట్రెన్స్, కిచెన్, వాష్ రూమ్, వంటి ప్రదేశాలు వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఏ ప్రదేశం మధ్యలో లేదా దగ్గరగా పెద్ద పరికరాలు లేకుండా చూడాలి. అలాగే ఇంటి వస్తువులను సరైన దిశలో అమర్చడం శక్తిని సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

ఇంట్లో శాంతి కోసం

ఇంట్లో శాంతి, ఆనందం, శ్రేయస్సు పెంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలు పాటించడం అవసరం. ఇంట్లో ప్రతి దిశను సరిగ్గా అమర్చడం, వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఉండడం వల్ల ఇంట్లో శాంతి పెరుగుతుంది. చిన్న మార్పులు చేయడం ద్వారా ప్రతికూల శక్తిని కూడా తగ్గించవచ్చు. పైన చెప్పిన విషయాలు మీ ఇంటి వాస్తు సమస్యలను సులభంగా పరిష్కరించడంలో చాలా సహాయపడుతాయి.