మహాకుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా 7 అడుగుల ఎత్తైన బాబా !
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కుంభమేళా గురించి అందరికి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్న ఈ మహాకుంభమేళా 2025కి దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఇందులో భాగంగానే రష్యా నుంచి వచ్చిన ఓ ప్రత్యేక సాధువు అందరి దృష్టిని ఆకర్షించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహాకుంభమేళా 2025 ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు దేశ, విదేశాల నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ కుంభమేళాలో రష్యా నుంచి వచ్చిన 7 అడుగుల పొడవున్న సాధువు ఆత్మ ప్రేమగిరి మహారాజ్ అందరి దృష్టిని ఆకర్షించారు. తన బలమైన శరీరంతో, సాదాసీదా కాషాయ వస్త్రాలతో, రుద్రాక్ష మాలతో ఈ “మస్కులర్ బాబా” భక్తుల మనసులను కట్టిపడేస్తున్నారు.
మస్కులర్ బాబా
7 అడుగులు ఉన్న రష్యాకు చెందిన ఈ సాధువు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. భారీ శరీరం, సాదాసీదా కాషాయ వస్త్రాలు, రుద్రాక్ష మాల, పెద్ద జోలాతో ఉన్న అతని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ సాధువు పేరు ఆత్మ ప్రేమగిరి మహారాజ్ ఇతను 7 అడుగుల పొడవు, బలమైన శరీరంతో ఉండటంతో చాలా మంది అతనిని పరశురాముడి అవతారంగా పిలుస్తున్నారు. ఆత్మ ప్రేమగిరి మహారాజ్ ఒకప్పుడు రెజ్లర్. 30 సంవత్సరాల క్రితం హిందూమతాన్ని తెలుసుకుని ఆ మతాన్ని స్వీకరించాడు. ఇప్పటి వరకు నేపాల్‌లో నివసిస్తూ హిందూమతాన్ని ప్రచారం చేయడమే అతని ప్రధాన లక్ష్యం.
ఈ మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమైన సంగతి అందరికి తెలిసిందే. ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. భక్తులు గంగా, యమునా, సారస్వతీ నదుల సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటోలు మీరు చూడండి.