AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంటికి ఏ దిశ అత్యంత శుభప్రదమైనదో తెలుసా..? ఈ దిశలో మాత్రం అస్సలు ఉండొద్దు..!

Vastu Shastra: హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. మీ ఇంటి డిజైన్ వాస్తు శాస్త్రం ప్రకారం ఉంటే.. మీ ఇంట్లో ఎప్పుడూ వాస్తు దోషాలు ఉండవు. మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోరు. ఇప్పుడు మనం మనం వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి ఏ దిశ అత్యంత పవిత్రమైనదో తెలుసుకోబోతున్నాము?

Vastu Tips: ఇంటికి ఏ దిశ అత్యంత శుభప్రదమైనదో తెలుసా..? ఈ దిశలో మాత్రం అస్సలు ఉండొద్దు..!
Vastu Tips
Rajashekher G
|

Updated on: Feb 04, 2026 | 8:10 PM

Share

హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం అనేక ఇంటి సమస్యలకు సరైన వాస్తు ద్వారా పరిష్కారం చూపిస్తుంది. వాస్తు శాస్త్రంలో మీ ఇల్లు ఎలా ఉండాలి? ఇంటి ప్రధాన ద్వారం ఏ దిశలో ఉండాలి? బెడ్‌రూమ్ దిశ ఎలా ఉండాలి, ఇంట్లో పూజా గది ఏ దిశలో ఉంచాలి, పూజా మందిరాన్ని నిర్మించేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? వంటగది ఏ దిశలో ఉండాలి అనే అనేక విషయాలను చెబుతుంది. అయితే, కొత్త ఇల్లు కొన్నప్పుడు లేదా ఇల్లు కట్టినప్పుడు, అది వాస్తు శాస్త్రం ప్రకారం లేకపోతే.. ఇంట్లో అనేక వాస్తు దోషాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడితే, అకస్మాత్తుగా మీ జీవితంలో సమస్యలు పెరుగుతాయి. ఉదాహరణకు, అకస్మాత్తుగా పెద్ద ఆర్థిక సంక్షోభం రావడం, లేదా ఇంట్లో ఎలాంటి కారణం లేకుండా గొడవలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి. అందుకే వాస్తు పండితులు వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచిస్తుంటారు. ఇప్పుడు మనం ప్రధాన ద్వారం గురించిన వాస్తు సంబంధ విషయాలను తెలుసుకుందాం.

ఇంటి ప్రధాన ద్వారం

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ తూర్పు దిశ వైపు ఉండాలి. ఎందుకంటే తూర్పు దిశకు అధిపతులు సూర్యుడు, ఇంద్రుడు. తూర్పు దిశను తెలివితేటలు, కెరీర్ పురోగతి, డబ్బు, ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు, అందుకే, ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ తూర్పు దిశ వైపు ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇది ఇంట్లోని వారికి శుభప్రదమని వాస్తు పండితులు చెబుతున్నారు.

ఇంటి ప్రధాన ద్వారం ఏ దిశలో ఉండకూడదు?

ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ దక్షిణ దిశలో ఉండకూడదు. ఎందుకంటే దక్షిణ, దిశను యముని దిశగా పరిగణిస్తారు. కాబట్టి, ఇంటి తలుపు ఎప్పుడూ దక్షిణ దిశలో ఉండకూడదు. ఇంటి తలుపు దక్షిణ దిశలో ఉంటే, ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది, దీని కారణంగా ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇంటి తలుపు పశ్చిమాన, ఉత్తరాన ఉన్నా.. ఎలాంటి ప్రతికూల ఫలితాలు ఉండవని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే, దక్షిణాన ఉండకూడదని వాస్తు శాస్త్రం స్పష్టం చేస్తోంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యశాస్త్రం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)