వారం నిల్వ ఉండే హెల్తీ సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్.. క్యారెట్ పుదీనా ఉంటే చాలు
04 June 2026
TV9 Telugu
TV9 Telugu
ఎండాకాలం చల్లచల్లగా ఏమైనా తాగాలనిపించడం సహజం. అలాంటప్పుడు బత్తాయి రసం, మ్యాంగో జ్యూస్ లాంటివి కాకుండా.. కొంచెం భిన్నమైన రుచిని ఆస్వాదించాలి- అనుకుంటే క్యారెట్ పుదీనా పానీయం ట్రై చేయండి..
TV9 Telugu
తయారీకి.. క్యారెట్ ముక్కలు - అర కిలో, పుదీనా - కప్పు, అల్లం - అంగుళం ముక్క, వేయించిన జీలకర్ర పొడి - రెండు స్పూన్లు, నిమ్మరసం - నాలుగు టేబుల్ స్పూన్లు, తేనె - కప్పు, ఉప్పు - చిటికెడు, నీళ్లు - రెండు కప్పులు తీసుకోవాలి
TV9 Telugu
ముందుగా క్యారెట్ ముక్కలను కడిగి ముక్కలుగా కోయాలి. వాటికి పుదీనా, అల్లం, కప్పు నీళ్లు జోడించి మెత్తగా గ్రైండ్ చేయాలి
TV9 Telugu
ఈ మిశ్రమాన్ని పల్చని వస్త్రంలో వేసి వడకట్టి రసం తీసుకోవాలి. మిగిలినదానికి మరో కప్పు నీళ్లు జతచేసి మళ్లీ వడకట్టాలి
TV9 Telugu
ఈ మొత్తం రసాన్ని మందమైన గిన్నెలో పోసి మధ్యస్థమైన సెగ మీద ఉంచాలి. తెర్లుతున్నప్పుడు తేనె, జీలకర్ర పొడి, ఉప్పు జోడించాలి
TV9 Telugu
సన్నసెగ మీద సుమారు పది నిమిషాలు మరిగించి.. కాస్త చిక్కగా అయ్యాక స్టౌ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత నిమ్మరసం కలపాలి
TV9 Telugu
ఈ చిక్కటి పానీయాన్ని శుభ్రమైన గాజు సీసాలోకి తీసి రిఫ్రిజిరేటర్‌లో భద్రం చేసుకుంటే.. ఒక వారం నిలవుంటుంది. తాగదలచినప్పుడు.. గ్లాసు నీళ్లలో రెండు స్పూన్ల తయారు చేసుకున్న కాన్‌సన్ట్రేట్ కలిపితే సరిపోతుంది
TV9 Telugu
అందులో కొద్దిగా సబ్జా గింజలు, రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మరింత ప్రత్యేకంగా ఉంటుంది. సోడాతో కలిపి కూడా తాగవచ్చు. సమయానికి తేనె లేకుంటే బెల్లం వేసుకోవచ్చు