Vaikuntha Ekadashi 2025: దర్శనంతోనే సమస్యలను పరిష్కరించే పెరుమాళ్ ఆలయం.. ఎక్కడుందో తెలుసా..
హిందువులు పవిత్రంగా పూజించే తిధుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాంటి ఆలయాల్లో ఒకటి వరదరాజ పెరుమాళ్ ఆలయం. ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ రోజు విశేష తిరుమంజనం సేవతో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు.
మన దేశంలో కొన్ని స్వయం భూ ఆలయాలు. అటువంటి ఒక ఆలయం తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని పోకలూర్ పట్టణంలో ఉన్న వరదరాజ పెరుమాళ్ ఆలయం ప్రఖ్యాతిగాంచింది. ఈ ఆలయం లో వైష్ణవ సంప్రదాయం ప్రకారం పూజలను నిర్వహిస్తారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. భక్తుల కోరిక మేరకు స్వయంభుగా వెలసిన ఈ ఆలయంలోని వరదరాజ పెరుమాళ్ స్వామిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు.
వరదరాజ పెరుమాళ్ ఆలయ చరిత్ర
ఆలయ గర్భ గుడిలో వెలసిన వరదరాజ పెరుమాళ్ స్వామి విగ్రహం స్వయంబువు. ఆ ఊరు దక్షిణ ప్రాంతంలో ఉన్నట్లు తన కలలో కనిపించినట్లు పరంధాముడు అనే ఒక భక్తుడు చెప్పాడు. మర్నాడు అతను చెప్పిన స్థలానికి చేరుకుని స్వామివారి విగ్రహానికి భక్తులు పూజలు చేశారు. కాంచీపురంలో ప్రజలపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఇక్కడ శ్రీదేవి, భూదేవి సమేతంగా వరదరాజ పెరుమాళ్ గా భక్తులతో పుజిస్తారు.
వరదరాజ పెరుమాళ్ ఆలయం అత్యంత పురాతనమైంది. ఈ ఆలయం చోళానంతర కాలానికి చెందినది. ఆలయ గోడలపై ఉన్న శాసనాల ప్రకారం విక్రమ-చోళ-విన్నగారం దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ 300 సంవత్సరాల పురాతనమైన తూర్పు ముఖంగా ఉన్న ఆలయంలోకి ప్రవేశించగానే గరుడాళ్వార్ మందిరం ఉంది. ఈ ఆలయానికి ఎడమవైపున రాహువు, కేతువులతో కూడిన తుంపికాయవరము, దాని కుడివైపున వేరు వేరు గర్భాలయాల్లో భక్త ఆంజనేయుడు.. అలాగే మహా మండపంలో ద్వారపాలకులుగా జయ, విజయులు, అర్ధమండపంలో నమ్మాళ్వార్, రామానుజర్ తిరుమేనిలు ఉన్నారు. ఈ ఆలయంలోని కన్య కోనేరులో అయ్యప్పన్ , గ్యాస్ కోనేరులో బాలమురుగన్. ప్రాకారంలో దక్షిణామూర్తి, విష్ణు, దుర్గా, నవగ్రహ క్షేత్రాలు కూడా ఉన్నాయి.
ఆలయ విశేషాలు
ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు బాలాభిషేకం, ప్రతి శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత ప్రత్యేక తిరుమంజన అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి శనివారం ఉపవాసం ప్రత్యేక పూజల్లో పాల్గొని పెరుమాళ్‌ను పూజిస్తే ఆయురారోగ్యాలు, మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం. అలాగే శని దోషం తొలగి.. శనిశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. శనివారాల్లో ఈ ఆలయంలోని ఆంజనేయుడికి తులసి మాల లేదా వడమాలతో పూజించడం వల్ల శత్రువుల భయం తోలగుతుందని నమ్మకం. వరదరాజ పెరుమాళ్‌ను పూజిస్తే సమస్యలు దూరమవుతాయని విశ్వాసం.
ప్రతి సంవత్సరం పురటాసి మాసంలో( పుష్య మాసంలో) శనివారం ఉదయం 5 గంటలకు వరదరాజ పెరుమాళ్ శ్రీదేవి భూదేవికి ప్రత్యేక తిరుమంజనం నిర్వహించి అనంతరం దీపారాధన నిర్వహిస్తారు. ఇక చివరి రోజైన శనివారం సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం వరదరాజ పెరుమాళ్ ఉత్సవమూర్తిగా గరుడ వాహనంపై పోకలూరు ప్రధాన వీధుల్లో విహరించి ఆలయానికి చేరుకుంటారు.
భక్తులు ఈ వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని ఉదయం 7 నుంచి 8.30 వరకు, సాయంత్రం 6 నుంచి 7.30 వరకు సందర్శించవచ్చు.
కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ మెట్టుపాళయం రహదారిపై పోకలూర్ 8 కి.మీ. ఇక్కడి బస్టాండ్ నుంచి దిగి రోడ్డు మీదుగా కొద్ది దూరం నడిచి ఆలయానికి చేరుకోవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.