Tirumala-Ugadi: శ్రీవారి ఆలయంలో ఈ నెల 22న ఉగాది ఆస్థానం.. ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..

Surya Kala

Surya Kala | Edited By: Anil kumar poka

Updated on: Mar 18, 2023 | 8:43 PM

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంల‌ను టీటీడీ రద్దు చేసింది. అంతేకాదు మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ

Tirumala-Ugadi: శ్రీవారి ఆలయంలో ఈ నెల 22న ఉగాది ఆస్థానం.. ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
Tirumala Tirupati

తెలుగువారి నూతన సంవత్సర వేడుక ఉగాది సందర్భంగా ఈ నెల 22 వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఈ ఏడాది శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి ..  విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు.. ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు:

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంల‌ను టీటీడీ రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి

మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు:

తిరుమల శ్రీ‌వారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేసింది. ఈ కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu