Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mars Transit: రేపటి నుంచి మిథునరాశిలో కుజుడు సంచారం.. ఈ 5 రాశుల వారికి సమస్యలు పెరగవచ్చు..

కుజుడు మార్చి 13న ఉదయం 5.47 గంటలకు మిథునరాశిలో  సంచరించనున్నాడు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. అంగారక గ్రహం బుధ గ్రహాల మధ్య శత్రుత్వం ఉంది. ఈ నేపథ్యంలో అంగారక సంచారము బుధుడికి చెందిన రాశి అయిన మిథునంలో జరుగుతోంది.

Mars Transit: రేపటి నుంచి మిథునరాశిలో కుజుడు సంచారం.. ఈ 5 రాశుల వారికి సమస్యలు పెరగవచ్చు..
Mars Transit 2023
Follow us
Surya Kala

|

Updated on: Mar 12, 2023 | 3:01 PM

అంగారకుడు నవగ్రహాల్లో ఒకటి.. సౌరవ్యవస్థలోని గ్రహాల్లో నాలుగవ గ్రహం. ఎర్రగా ఉండడంతో అరుణ గ్రాహం అని కుజుడు అని కూడా అంటారు.  జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని యోధుడిగా పరిగణిస్తారు. యుద్ధం, ధైర్యం, శక్తి, కోపానికి కారకంగా పరిగణించబడుతుంది. మేష రాశికి అధిపతి అంగారక గ్రహం. మకరరాశిని అంగారకుని శ్రేష్ఠమైన రాశిగా పరిగణిస్తే, వృశ్చికం బలహీనమైన రాశిగా పరిగణించబడుతుంది. శని, బుధ గ్రహాలు వారి శత్రు గ్రహాలుగా పరిగణించబడుతున్నాయి. చంద్రుడు, సూర్యుడు, గురువు మిత్ర గ్రహాలు. కుజుడు మార్చి 13న ఉదయం 5.47 గంటలకు మిథునరాశిలో  సంచరించనున్నాడు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. అంగారక గ్రహం బుధ గ్రహాల మధ్య శత్రుత్వం ఉంది. ఈ నేపథ్యంలో అంగారక సంచారము బుధుడికి చెందిన రాశి అయిన మిథునంలో జరుగుతోంది. మిథునరాశిలో కుజుడు సంచరించడం వల్ల ఏ రాశుల వారు జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం..

వృషభ రాశి: ఈ రాశి వారికి అంగారక సంచారం కొన్ని కష్టాలను కలిగిస్తుంది. సమస్యలు పెరగవచ్చు. పని చేస్తున్న ప్రదేశంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. వాదనలు జరగవచ్చు. డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో ఏదైనా సమస్య ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక విషయంలో వైరం ఏర్పడవచ్చు.

మిధున రాశి: కుజుడు ఈ  రాశిలో సంచరించనున్నాడు. బుధుడికి చెందిన రాశి అయిన మిధున రాశిలో అడుగు పెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రెండు గ్రహాల మధ్య  శత్రుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కుజుడు తన శత్రువైన బుధుడు రాశిలో రావడంతో ఈ రాశికి చెందిన వ్యక్తులకు కొన్ని కష్టలు ఏర్పడవచ్చు.  ఉద్యోగస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పని ఎక్కువ అవుతుంది. దీంతో ఈ రాశివారు ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు.

ఇవి కూడా చదవండి

వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంగారక గ్రహ సంచారం ఈ రాశి వ్యక్తులకు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి వారు మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు వీరు మరింత అప్రమత్తంగా ఉండాలి.

ధనుస్సు రాశి:  జెమినిలో అంగారకుడి సంచార ప్రభావం ఈ రాశి వారికీ కష్టాలును కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు తమ ఆఫీసులో ఇబ్బందులు.. తమ యజమానితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. వాదనలు జరిగే అవకాశం కూడా ఉంది. మరోవైపు, వ్యాపారవేత్తలు మరింత జాగ్రత్తగా .. అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి  నిర్ణయాలు తీసుకున్నా ఒకటికి పది సార్లు ఆలోచించి తీసుకోవడం మంచిది. లేకపోతే మీరు చాలా నష్టపోవచ్చు.

కుంభ రాశి ఈ రాశి వారి జాతకంలో ఐదవ ఇంట్లో కుజుడు సంచారం జరగబోతోంది. ఈ రాశివారు జాతకంలో మూడవ, పదవ ఇంటికి అంగారకుడు అధిపతి. కుజుడు శక్తికి, కోపానికి కారకుడు కాబట్టి అతిగా కోపాన్ని మానుకోవాలి. లేదంటే నష్టం జరగవచ్చు. ధననష్టం, అనవసర ఖర్చులు పెరుగుతాయి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)