Tulasi Puja Tips: తులసి మొక్కను ఏ దిశలో నాటాలి.. ఎప్పుడు నీరు పోయాలి.. ఎప్పుడు ఆకులు తెంపాలో తెలుసుకోండి..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి ఉన్న ఇల్లు, ఆ ఇంట్లో ఎటువంటి దోషం ఉండదని శ్రీ హరి అనుగ్రహం సదా ఆ కుటుంబంపై ఉంటుందని విశ్వాసం. మీరు కూడా మీ ఇంట్లో అదృష్టాన్ని తెచ్చే తులసిమొక్కను పెంచుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే.. ముందుగా తులసి మొక్క పెంపకానికి సంబంధించిన నియమాల గురించి తెలుసుకుందాం..
సనాతన హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్కను పెంచుతారు. ఇంట్లో తులసి ఉండడం వలన ఆనందం ఉంటుందని.. అదృష్టాన్ని పెంచుతుందని భావిస్తారు. హిందూమతంలో విష్ణుప్రియగా అత్యంత గౌరవప్రదంగా పరిగణించబడే తులసికి జ్యోతిషశాస్త్రంలో కూడా చాలా ముఖ్యమైన స్థానం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి ఉన్న ఇల్లు, ఆ ఇంట్లో ఎటువంటి దోషం ఉండదని శ్రీ హరి అనుగ్రహం సదా ఆ కుటుంబంపై ఉంటుందని విశ్వాసం. మీరు కూడా మీ ఇంట్లో అదృష్టాన్ని తెచ్చే తులసిమొక్కను పెంచుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే.. ముందుగా తులసి మొక్క పెంపకానికి సంబంధించిన నియమాల గురించి తెలుసుకుందాం..
తులసిని ఎప్పుడు ఎక్కడ నాటాలంటే.. హిందూ విశ్వాసాల ప్రకారం తులసి మొక్కను ఇంట్లో గురువారం నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున తులసి మొక్కను నాటడం వలన శ్రీ హరి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. తులసి మొక్కను నాటే సమయంలో దిశను కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాస్తు ప్రకారం, తులసి మొక్కను ఎల్లప్పుడూ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటాలి. వాస్తు ప్రకారం తులసి మొక్కను పొరపాటున కూడా ఆగ్నేయ దిశలో నాటకూడదు.
తులసికి సంబంధించిన నివారణలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా బుధుడు బలహీనంగా ఉన్నట్లు అయితే.. వారు బుధవారం రోజున ఇంట్లో తులసి మొక్కను నాటాలి. అంతేకాదు ప్రతిరోజూ తులసి మొక్కను పూజించాలి.
ఎవరి జాతకంలోనైనా బృహస్పతి గ్రహానికి సంబంధించిన దోషంతో ఇబ్బందులు పడుతుంటే..తులసి మొక్క మంచి నివారణ చర్య. దేవగురువు బృహస్పతి గ్రహాల్లో ఐశ్వర్య కారకుడిగా భావిస్తారు. కనుక ఐశ్వర్యం పొందడానికి పూజ గదిలో స్వచ్ఛమైన దేశీ నెయ్యితో దీపం వెలిగించాలి.
సాయంత్రం సమయంలో తులసి మొక్కను పసుపు తో పూజించాలి. తులసి పూజకు పసుపు, కుంకుమలు తో చేసే పూజతో అదృష్టం లభిస్తుందని విశ్వాసం. ఆనందం లభిస్తాయని శ్రీ విష్ణువుతో పాటు, లక్ష్మీ దేవి కూడా భక్తులపై ఆశీర్వాదాలను కురిపిస్తారని విశ్వాసం.
ఆది, మంగళవారాల్లో తులసి మొక్కకు నీరు సమర్పించవద్దు. అంతేకాదు తులసి ఆకులను మొక్కనుంచి తెంపవద్దు. హిందూ విశ్వాసం ప్రకారం ఏకాదశి రోజున కూడా తులసి చెట్టు నుండి ఆకులు తెంపవద్దు.
అంతేకాదు తులసి ఆకులను ఎప్పుడూ చెత్తలో వేయకూడదు. అయితే వాడిన తులసి ఆకులను మట్టిలో వేసి ఎరువుగా ఉపయోగించాలి.
తులసి మొక్కను ఎప్పుడూ అపవిత్రమైన లేదా చీకటి ప్రదేశంలో ఉంచవద్దు. అంతేకాదు తులసి మొక్కను మంచి ఎండ, వెలుతురు ఉన్న ప్లేస్ లో ఉంచాలి. సాయంత్రం పూట తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి.
తులసి మొక్క దగ్గర అపవిత్రమైన వస్తువులను ఎప్పుడూ ఉంచకూడదు. స్నానం చేయకుండా అపవిత్రమైన చేతులతో తులసి మొక్కను తాకరాదు. తులసి ఆకులను తీయాలంటే.. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి వాటిని తీయాలి. సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను తీయకండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).