Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Pradosh 2023: పిల్లలతో సమస్యలా, జాతకంలో శని దోషమా.. ప్రదోష వ్రతంతో శుభఫలితాలు.. పూజా విధానం మీకోసం

హిందూ విశ్వాసం ప్రకారం ప్రదోష వ్రతాన్ని త్రయోదశి తిథిని ఆచరించిన భక్తుల కష్టాలు జీవితంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు అతని జీవితంలో ఎటువంటి వ్యాధి, దుఃఖం లేదా భయం ఉండదు. ఈ నేపథ్యంలో శివుని పూజిస్తే శని దేవుడి అనుగ్రహాన్ని కురిపించే ప్రదోష వ్రతం ఎప్పుడు ఆచరించాలి. పూజా విధానం, శుభ సమయం గురించి తెలుసుకుందాం.. 

Shani Pradosh 2023: పిల్లలతో సమస్యలా, జాతకంలో శని దోషమా.. ప్రదోష వ్రతంతో శుభఫలితాలు.. పూజా విధానం మీకోసం
Shani Pradosha Vratam
Follow us
Surya Kala

|

Updated on: Jun 23, 2023 | 11:07 AM

సనాతన సంప్రదాయంలో శివుడు భోళాశంకరుడుని కేవలం జలంతో అభిషేకం చేసినా సులభంగా ప్రసన్నడవుతాడని భక్తుల విశ్వాసం. శివుడి ఆశీర్వాదం లభించిన భక్తుల జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్మకం. మహాదేవుడిని పూజించిన వ్యక్తుల బాధలు, దురదృష్టం రెప్పపాటులో తొలగిపోతాయని నమ్ముతారు. హిందూ విశ్వాసం ప్రకారం ప్రదోష వ్రతాన్ని త్రయోదశి తిథిని ఆచరించిన భక్తుల కష్టాలు జీవితంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు అతని జీవితంలో ఎటువంటి వ్యాధి, దుఃఖం లేదా భయం ఉండదు. ఈ నేపథ్యంలో శివుని పూజిస్తే శని దేవుడి అనుగ్రహాన్ని కురిపించే శని ప్రదోష వ్రతం ఎప్పుడు ఆచరించాలి. పూజా విధానం, శుభ సమయం గురించి తెలుసుకుందాం..

శని ప్రదోష వ్రతం ఎప్పుడు పంచాంగం ప్రకారం శివునితో పాటు శనీశ్వరుడు ఆశీర్వాదాలను అందించే శని ప్రదోష వ్రతం జూలై 01  2023న ఆచరిస్తారు. పంచాంగం ప్రకారం త్రయోదశి తిథి జూలై 01, 2023న ఉదయం 01:16 గంటలకు ప్రారంభమై అదే రోజు రాత్రి 11:07 గంటలకు ముగుస్తుంది. అంతేకాదు శివుని ఆరాధనకు ఉత్తమమైనదిగా భావించే ప్రదోషకాలం సాయంత్రం 07:23 ప్రారంభమై.. రాత్రి 09:24 ముగుస్తుంది.

శని ప్రదోష పూజ ఎలా చేయాలంటే శని ప్రదోష వ్రతం రోజున.. ఉదయాన్నే నిద్రలేచి.. అభ్యంగ స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. తర్వాత ధ్యానం చేసి శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకోవాలి. లేదా నియమ, నిబంధనల ప్రకారం ఇంట్లోని పూజ గదిలో శివుడిని పూజించాలి. దీని తరువాత ప్రదోషకాలానికి ముందు సాయంత్రం మరోసారి స్నానం చేసి గంగాజలం, పువ్వులు, పండ్లు, దీపం, ధూపం, బిల్వ పత్రం, జమ్మి ఆకులతో, భస్మం, చందనం మొదలైన వాటితో శివుని పూజించాలి. దీని తరువాత ప్రదోష వ్రత కథను చదివి, చివరలో మహాదేవునికి ఆరతి ఇచ్చి మీ కోరికను శివాయ్యకు విన్నవించుకోవాలి.

ఇవి కూడా చదవండి

శని ప్రదోష ఉపవాసం.. చేయాల్సిన పరిహారాలు  ఎవరి జాతకంలో శనిదోషంఉంది.. దాని వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటు ఉంటె.. శని ప్రదోషం రోజున, శివలింగానికి జలాభిషేకం చేయాలి. అనంతరం జమ్మి ఆకులను సమర్పించలి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. శివుని ఆరాధనకు సంబంధించిన ఈ పరిహారం చేయడం ద్వారా, శని సంబంధమైన కష్టాలు తొలగిపోయి, సాధకుడికి ఆనందం, అదృష్టం, సంపద లభిస్తుందని నమ్ముతారు. శని ప్రదోష వ్రతం ఆచరించడం వల్ల పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా దూరమై ఆ ఇంట్లో సంతోషం నెలకొంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).