Friday Astro Tips: లక్ష్మీదేవి, శుక్రుడు అనుగ్రహం కోసం శుక్రవారం చేయాల్సిన దానాలు.. పూజ విధానం మీకోసం
శుక్రవారం.. లక్ష్మీదేవికి మాత్రమే కాదు.. శుక్ర గ్రహం లేదా శుక్రదేవునికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. శుక్రుడు ఆనందం, అందం, శృంగారానికి కారకుడిగా పరిగణించబడతాడు. శుక్రవారం రోజున భక్తితో అంకితభావంతో కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా జీవితంలో ఎల్లప్పుడూ ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతారు. శుక్రదేవుని అనుగ్రహంతో జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. ఈ ప్రత్యేక చర్యల గురించి తెలుసుకుందాం.
సనాతన హిందూ ధర్మంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవతకు అంకితం చేసి పూజిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం. ఈ రోజున అమ్మవారిని పూజించిన భక్తులపై లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని.. విశ్వాసం. అందుకనే లక్ష్మీదేవిని అనుగ్రహము కోసం ఉపవాసం ఉంటారు. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన వారి జీవితంలో ఎప్పుడూ సుఖ సంపదలకు లోటు ఉందని నమ్మకం. శుక్రవారం.. లక్ష్మీదేవికి మాత్రమే కాదు.. శుక్ర గ్రహం లేదా శుక్రదేవునికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. శుక్రుడు ఆనందం, అందం, శృంగారానికి కారకుడిగా పరిగణించబడతాడు.
శుక్రవారం రోజున భక్తితో అంకితభావంతో కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా జీవితంలో ఎల్లప్పుడూ ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతారు. శుక్రదేవుని అనుగ్రహంతో జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. ఈ ప్రత్యేక చర్యల గురించి తెలుసుకుందాం.
- శుక్రవారం ఉపవాసం లక్ష్మిదేవి, శుక్రుని అనుగ్రహాన్ని పొందడానికి చాలా ప్రభావవంతమైన పరిహారం. ఈ రోజున “ఓం శుం శుక్రాయ నమః” లేదా “ఓం హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం” అనే ప్రత్యేక మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇది ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.
- లక్ష్మీదేవి, శుక్రుడు ఎప్పుడూ మురికిలో నివసించరు. అందుకే వీరి ఆశీస్సులు పొందాలంటే మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఇంట్లో శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
- శుక్రవారం తెలుపు రంగుకు సంబంధించినది.. కనుక ఈ రోజున తెలుపు రంగు దుస్తులు ధరించి పూజలు చేయాలి.
- ఈ రోజున ఉపవాసంతో పాటు శుక్ర గ్రహానికి సంబంధించిన వస్తువులను కూడా దానం చేయడం శ్రేయస్కరం.
- శుక్రవారాల్లో బియ్యం, పాలు, పెరుగు, పిండి , పంచదార మిఠాయి వంటి తెల్లని రంగుల వస్తువులను దానం చేయడం మేలు చేస్తుంది.
- శుక్రవారం రోజున చీమలకు, ఆవులకు ఆహారం తినిపించడం వలన శుక్ర దేవుడి ఆశీర్వాదం లభిస్తుంది.
- విష్ణువు లేనిదే లక్ష్మీదేవిని పూజించడం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అందుకే శుక్రవారం నాడు విష్ణువు,లక్ష్మిని కలిసి పూజించాలి. ఇది సిరి, సంపద,ధాన్యాలు,కీర్తిని ఇస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).