AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balamurugan Statue: ఎత్తైన ఏకశిలా బాలమురుగన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు.. 2000 లీటర్ల పాలతో అభిషేకం

కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు, బలమురుగన్ వంటి పేర్లతో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ముఖ్యంగా తమిళనాడులో బలమురుగన్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో  40 అడుగుల ఎత్తు.. 180 టన్నుల బరువుతో కూడిన ఏకశిలా విగ్రహం భక్తులను కనువిందు చేసింది. 2వేల లీటర్ల పాలతో ఏకశిలా విగ్రహాన్ని అభిషేకించారు.

Balamurugan Statue: ఎత్తైన ఏకశిలా బాలమురుగన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు.. 2000 లీటర్ల పాలతో అభిషేకం
Vishwarupa Balamurugan
Surya Kala
|

Updated on: Jun 23, 2023 | 7:28 AM

Share

శివ పార్వతుల తనయుడు తారకాసుర వధ కోసం జన్మించిన వాడు సుబ్రమణ్య స్వామి. మన దేశ వ్యాప్తంగానే కాదు మలేషియా వంటి దేశాల్లో కూడా సుబ్రహ్మణ్యుడి అనేక దేవాలయాలున్నాయి. కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు, బలమురుగన్ వంటి పేర్లతో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ముఖ్యంగా తమిళనాడులో బాలమురుగన్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో  40 అడుగుల ఎత్తు.. 180 టన్నుల బరువుతో కూడిన ఏకశిలా విగ్రహం భక్తులను కనువిందు చేసింది. 2వేల లీటర్ల పాలతో ఏకశిలా విగ్రహాన్ని అభిషేకించారు. వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్ తాండలం దగ్గర 40 అడుగుల ఎత్తు.. 180 టన్నుల ఉన్న ఏకశిల విగ్రహం విశ్వరూప బాలమురుగన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహాలకు సుమారు 2000 వేల లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించారు. రత్నగిరి బాలమురుగన్ స్వామి నేతృత్వంలో 108 మంది మహిళలు పాల బిందెలు తీసుకుని వచ్చి మురుగన్ కు పాలాభిషేకం చేశారు.

స్వామి వారికీ చేసిన పాలాభిషేకం భక్తులను కనువిందు చేసింది. కొండల నుంచి జాలు వారీ జలపాతాన్ని తలపిస్తూ.. మురుగన్ విగ్రహం మీద నుంచి పాల ధార జాలువారింది… ఇది చూసిన భక్తులు దైవంపై భక్తితో    ఆనందంతో పరవశించిపోయారు. అంతకుముందు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఇవి కూడా చదవండి

హారహర నామస్మరణతో ఆలయ వీధులు హోరెత్తాయి. పాలాభిషేకం అనంతరం భక్తులు సుబ్రమణ్య స్వామి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ముందుస్తు చర్యలు తీసుకున్న అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలను ఆలయాధికారులు కల్పించారు.

ఆలయ ప్రత్యేకతలు:

స్వామి బాలమురుగన్ 40 అడుగుల ఎత్తులో ఒకే రాయిలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. ఈ  ఆరు కోణాల నక్షత్ర పీఠం పై స్వామివారు కొలువుదీరారు. ఇక్కడ ధ్యాన మందిరంలో గణపతి, సరస్వతి దేవి, దక్షిణామూర్తి, విష్ణువు, శివుడు, హనుమంతుడు సహా నవగ్రహాల పది ఉప క్షేత్రాలున్నాయి. ఈ ధ్యాన కేంద్రాన్ని పలువురు భక్తులు దర్శించుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..