Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు.. వారు కొండమీదకు రావద్దని వినతి

వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్లే సామాన్య భక్తుల కోసం సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియను జనవరి 1వ తేది నుంచి ప్రారంభించనున్నారు. 24 గంటలు కౌంటర్స్ తెరిచే ఉంటాయి. ఈ మేరకు సర్వదర్శనం భక్తులకు..  తిరుపతి లోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 92 కౌంటర్లు ద్వారా ఏకాదశి దర్శనానికి టోకెన్లు జారీ చేయనున్నారు. 

Tirumala: వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు.. వారు కొండమీదకు రావద్దని వినతి
Tirumala Tirupati
Follow us
Surya Kala

|

Updated on: Dec 30, 2022 | 5:42 PM

కొత్త సంవత్సరంతో పాటు జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రానికి భారీ సంఖ్యలో భక్తులు రానున్నారనే అంచనాలతో టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి హెచ్చరికల నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు పలు సూచనలు చేశారు.  అంతేకాదు వైకుంఠ ద్వారా దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులు టీటీడీ అధికారులు సూచనలు పాటించి.. శ్రీవారి దర్శనం చేసుకుని.. యాత్రను సౌకర్యవంతంగా ముగించమని కోరారు.

వైకుంఠ ద్వారాన్ని 10 రోజుల పాటు తెరచి ఉంచనున్నారు. వీలైనంత ఎక్కువ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. సుమారు 8 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం కలగనుంది. అయితే తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే  భక్తులందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించారు. వ్యక్తిగత నియంత్రణ, శానిటైజేషన్ పాటించాలి.

వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్లే సామాన్య భక్తుల కోసం సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియను జనవరి 1వ తేది నుంచి ప్రారంభించనున్నారు. 24 గంటలు కౌంటర్స్ తెరిచే ఉంటాయి. ఈ మేరకు సర్వదర్శనం భక్తులకు..  తిరుపతి లోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 92 కౌంటర్లు ద్వారా ఏకాదశి దర్శనానికి టోకెన్లు జారీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

తిరుపతిలో టోకెన్స్ ఇచ్చే ప్రదేశాలు

1) భూదేవి కాంప్లెక్స్

2) శ్రీనివాసం

3)గోవిందరాజు స్వామి సంత్రం

4) MR పల్లి Z.P.హైస్కూల్

5) మున్సిపల్ ఆఫీసు

6) రామచంద్ర పుష్కరిణి

7) రామానాయుడు స్కూల్

8) జీవకోన Z.P.హైస్కూల్

9) తిరుమల – కౌస్తభం

సర్వదర్శనం భక్తులుకు 4.5 లక్షల టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులుకు ఇబ్బంది లేకుండా అన్నప్రసాద వితరణ, తాగునీరు, పాలు, టీ ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. శ్రీవాణి ట్రస్టు భక్తులకు ఆన్‌లైన్‌లో రోజుకు 2వేల చొప్పున టికెట్లు జారీ చేశారు. ఆఫ్‌ లైన్‌లో ద్వారా టికెట్ల జారీ ప్రక్రియ నిలిపివేశారు.

డిసెంబర్ 29 నుండి జనవరి 3వ తేది వరకు అడ్వాన్స్ విధానంలో వసతి గదులు కేటాయింపు రద్దు చేశారు. అంతేకాదు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో అంటే జననరి 2, 3వ తేదిలలో సిఫార్సు లేఖలను స్వీకరించమని.. ఈ రెండు రోజులు స్వయంగా వీఐపీలు వస్తేనే దర్శనాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఏకాదశి పర్వదినం నుంచి .. పది రోజులు పాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు.

జనవరి 2న ఏకాదశి పర్వదినం రోజున ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతనిస్తామని .. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. టోకెన్లపై ఉన్న తేదీ..  సమయానికే భక్తులు తిరుమలకు రావాలని టీటీడీ అధికారులు కోరారు.

అంతేకాదు ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1వ తేదిన సర్వదర్శనం టోకేన్లు జారీ రద్ద చేసినట్లు భక్తులు ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రయాణానికి ఏర్పట్లు చేసుకోవాలని సూచించారు. వైకుంఠ ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు వీలుగా లడ్డూ విక్రయశాలల్లో అదనపు లడ్డూ నిల్వలు, కల్యాణకట్టలో అదనపు సిబ్బంది ని నియమించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. టోకెన్స్ లేని వారికి కొండ మీదకి అనుమతిస్తారు కాని వారికి దర్శనం చేసుకునే అవకాశం కల్పించరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..