AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవాణి భక్తుల కోసం కొత్త విధానం.. ఏరోజుకారోజే దర్శనం

తిరుమల వెంకన్న దర్శనం కోసం శ్రీవాణి టికెట్లను తీసుకున్న భక్తులు ఇకపై గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. భక్తులకు సుదర్శనం టోకెన్ల కంకణాల తరహాలో భక్తులకు ముంజేతికి డిజిటల్ టోకెన్లను కట్టేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఉదయాన్నే ఈ టోకెన్లు పొందిన భక్తులు గంటల తరబడి వేచి ఉండే అవసరం లేకుండా వారి ఇతరత్రా పనులు చూసుకుని దర్శనానికి వెళ్లే సమయంలోపుగా ఏ సమయంలోనైనా టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తారు.

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవాణి భక్తుల కోసం కొత్త విధానం.. ఏరోజుకారోజే దర్శనం
Tirumala Darshan Current Update
Surya Kala
|

Updated on: Aug 08, 2025 | 10:33 AM

Share

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేకంగా వీఐపీల సౌకర్యార్థం అమలు చేస్తున్న శ్రీవాణి టిక్కెట్ల కేటాయింపులను భక్తులకు మరింత చేరువ చేసే దిశగా మెరుగైన సౌకర్యాలను అందించేందుకు టీటీడీ ఆధునిక పద్ధతులను ఆలంబిస్తోంది. ఆఫ్లైన్ విధానంలో ప్రతిరోజు 800 టికెట్లను తిరుమలలో కేటాయిస్తున్న పద్ధతిని భక్తులకు సౌకర్యవంతంగా ఇటీవలే మార్పులు చేపట్టారు. 10.500 రూపాయలు చెల్లిస్తున్న ఈ సౌకర్యాల కల్పనలో టీటీడీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తుల ఇబ్బందులను స్వయంగా పరిశీలించి అధ్యయనం చేసిన అనంతరం ఇకపై శ్రీవాణి టికెట్లను క్యూ లైన్ లో గంటలు తరబడి వేచి ఉండి ఇబ్బందులు పడకుండా భక్తులకు సుదర్శనం టోకెన్ల కంకణాల తరహాలో భక్తులకు ముంజేతికి డిజిటల్ టోకెన్లను కట్టేలాగా నిర్ణయం తీసుకున్నారు.

ఉదయాన్నే ఈ టోకెన్లు పొందిన భక్తులు గంటల తరబడి వేచి ఉండే అవసరం లేకుండా వారి ఇతరత్రా పనులు చూసుకుని దర్శనానికి వెళ్లే సమయంలోపుగా ఏ సమయంలోనైనా టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తారు. ఇందుకోసం ఉదయాన్నే క్యూలైన్లో వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ అనే పద్ధతిలో 800 మంది భక్తులకు టోకెన్ తరహాలో డిజిటల్ కంకణాన్ని చేతికి కడతారు. అందులో సీరియల్ నెంబర్ తో పాటు భక్తుల వివరాలు కూడా సిస్టంలో నమోదు చేసిన అనంతరం పంపిణీ చేస్తారు. మరో వారం రోజులు లోపుగా ఈ తాజా నిర్ణయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులతో అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు.‌

ప్రస్తుతం శ్రీవాణి టికెట్లను పొందేందుకు తిరుమలలోని హెచ్ వి డి సి ప్రాంతంలో ప్రత్యేకంగా ఆధునికరించిన కార్యాలయాన్ని కూడా కొద్ది రోజుల క్రితమే ప్రారంభించారు. ఇక్కడ శ్రీవాణి టికెట్లను తీసుకున్న రోజు కాకుండా మరుసటి రోజున శ్రీవారి దర్శనాన్ని కల్పించే పద్ధతికి స్వస్తి పలికి ఏ రోజు కా రోజు ఉదయం టికెట్లు తీసుకుంటే సాయంత్రం నాలుగు గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతించే విధంగా ఇటీవలే మార్పులు తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అయినప్పటికీ రోజు రోజుకి శ్రీవాణి టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది‌. ఈ టికెట్లను పొందేందుకు ఉదయం 6 గంటల నుండి భక్తులు క్యూ కడుతున్నారు. అయితే టీటీడీ మాత్రం ఉదయం 10 గంటలకు టికెట్ల పంపిణీ ప్రారంభిస్తోంది. నాలుగు లైన్లతో కూడిన టికెట్ల కౌంటర్లను శ్రీవాణి టికెట్లు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ భక్తుల తాకిడి అధికం కావడం చివరకు ఎనిమిది వందల టికెట్లు కేటాయింపు పూర్తయి మిగిలిన వారికి మొండి చేయి చూపాల్సి రావడం పై టీటీడీ అధికారులకు ఒక విధంగా ఒత్తిడి ఏర్పడుతోంది.‌ ఒత్తిడి మాట ఎలా ఉన్నా భక్తులకు గంటలు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి లేకుండా శ్రీవాణి టిక్కెట్ల కేటాయింపుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి పది నిమిషాల్లో టికెట్లు పొంది సౌకర్యంగా దేవుడు దర్శనానికి వెళ్లే విధంగా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఏర్పాట్లు చేపట్టారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.