AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakhi Festival: రాఖీ అంటే రక్ష సూత్రం.. ఈ పండగ జరుపుకోవడం వెనుక ఉన్న పురాణ కథలు ఏమిటంటే..

హిందువులు జరుపుకునే పండగల్లో రాఖీ పండగకి విశిష్ట స్థానం ఉంది. ఈ పండగ జరుపుకోవడం వెనుక పురాణ కథలు కేవలం భావోద్వేగానికి సంబంధించినవి మాత్రమే కాదు.. అవి విశ్వాసానికి శాశ్వత రూపం. శ్రీ కృష్ణుడి నుంచి యమ ధర్మ రాజు వరకు రాఖీ పండగకి సంబంధించిన అనేక కథలు నేఇకీ వినిపిస్తున్నాయి. ఈ రోజు రాఖీ పండగకి సంబంధించిన రక్షతో ముడిపడి ఉన్న ఆ కథలు ఏమిటో తెలుసుకోండి.

Rakhi Festival: రాఖీ అంటే రక్ష సూత్రం.. ఈ పండగ జరుపుకోవడం వెనుక ఉన్న పురాణ కథలు ఏమిటంటే..
Rakshi Festival 2025
Surya Kala
|

Updated on: Aug 08, 2025 | 11:23 AM

Share

రాఖీ అనేది కేవలం ఒక దారం కాదు. ఇది రక్షణ, ప్రేమ, నమ్మకం అనే భావనతో ఏర్పడిన రక్షణ దారం. హిందూ మతంలో రాఖీ పండగ గురించి అనేక పురాణ కథలు ఉన్నాయి. ఇవి సోదరుడు, సోదరి సంబంధానికి మాత్రమే పరిమితం కాకుండా,.. దేవతలు, ఋషులు, రాక్షసులకు సంబంధించిన కథలను కూడా అనుసంధానిస్తాయి. రాఖీ అర్థాన్ని ఇచ్చే ఆ పౌరాణిక కథలు ఏమిటో ఈ రోజు మనం తెలుసుకుందాం.

కృష్ణుడు, ద్రౌపది: మహాభారతంలోని ఈ కథలో రాఖీ భావన మనసుని తాకుతుంది. శ్రీ కృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుడిని వధించిన తర్వాత అతని చేతి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. అది చూసిన వెంటనే ద్రౌపతి తన చీర అంచును చించి కృష్ణుడి వేలికి కట్టింది. ఆ దారం కేవలం వస్త్రం కాదు. అది ప్రేమ, ఆప్యాయత, రక్షణకి సంబంధించిన వాగ్దానం. ప్రతిగా ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో నిస్సహాయ సమయంలో, కృష్ణుడు ఆ రక్షణ దారాన్ని గౌరవించి ఆమె గౌరవాన్ని కాపాడాడు. ఈ సంఘటనతో రాఖీ కట్టడం అత్యంత భావోద్వేగ, దైవిక వివరణగా పరిగణించబడుతుంది.

ఇంద్రుడు, ఇంద్రాణి: పురాణాల ప్రకారం దేవలోక అధిపతి ఇంద్రుడు రాక్షసులతో పోరాడుతూ ఓటమి పాలైనప్పుడు.. అతని భార్య ఇంద్రాణి ప్రత్యేక మంత్రాలతో పవిత్రం చేయబడిన ఒక దారాన్ని తయారు చేసి ఇంద్రుని మణికట్టుపై కట్టింది. ఈ దారం శ్రావణ పూర్ణిమ రోజున కట్టబడిన రక్ష-సూత్రం. దీని తరువాత ఇంద్రుడు యుద్ధంలో గెలిచాడు. ఇక్కడ ఈ రాఖీ భార్యాభర్తల సంబంధానికి మాత్రమే పరిమితం కాదు.. రక్షణ యొక్క సంకల్పం ఏ సంబంధంలోనైనా ఉంటుందని ఇది రుజువు చేస్తుంది. నమ్మకం ఉన్న చోట రక్ష సూత్రం పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

వామనుడు, బలి, లక్ష్మిదేవిల సంబంధం: శ్రీ మహా విష్ణువు వామన రూపంలో వచ్చి బలి రాజు నుంచి మూడు అడుగుల భూమిని అడిగినప్పుడు.. బలి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి స్వర్గాన్ని కూడా దానం చేశాడు. అప్పుడు లక్ష్మీదేవి బ్రాహ్మణ వధువుగా వేషంలో బాలికిగా వెళ్లి అతనికి రాఖీ కట్టి రక్షణ వాగ్దానం చేసింది. ప్రతిగా బలి విష్ణువు ఎల్లప్పుడూ తనతో ఉండాలని ఆమె నుంచి వరం కోరాడు. ఈ కథ రాఖీ రక్షణ కోసమే కాదు దేవుడిని ప్రేమ, నమ్మకంతో బంధించగలదని చూపిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.