AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు అదిరిపోయే న్యూస్.. తిరుమలలో ప్రత్యేక ఫుడ్ మెనూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచితంగా..

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్, 10 రోజుల పాటు పలు దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్బంగా భక్తుల రద్దీ భారీగా పెరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తుల దర్శనానికి అవకాశం కల్పించనుంది. అందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయ్యాయి.

Tirumala: శ్రీవారి భక్తులకు అదిరిపోయే న్యూస్.. తిరుమలలో ప్రత్యేక ఫుడ్ మెనూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచితంగా..
Tirumala
Venkatrao Lella
|

Updated on: Sep 14, 2026 | 7:29 AM

Share

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఏకంగా 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నుంచి వెంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఈ నెల 23వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు దర్శనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ భావిస్తోంది. అందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఇప్పటికే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఇవాళ అంకురార్పణ చేయనుంది. సెప్టెంబర్ 15వ తేదీన సాయంత్రం 6.21 గంటల నుంచి 6.35 గంటల మధ్య ధ్వజారోహణ జరగనుండగా.. చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం చంద్రబాబు శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొకుండా ఏర్పాట్లు చేసింది. అయితే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రద్దీ కారణంగా పలు దర్శనాలను రద్దు చేసింది. అన్ని రకాల ప్రివిలేజ్డ్‌ దర్శనాలతోపాటు శ్రీవాణి టికెట్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ దర్శనాల రద్దు వల్ల రోజూ 3 గంటల సమయం ఆదా కానుంది. ఈ సమయంలో సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. దీని వల్ల భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గుతుంది.

తిరుమలలో ప్రతీ రోజు 80 వేల మందికి శ్రీవారి దర్శన అవకాశం కల్పిస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంతో.. ఆ గదులను కూడా సామాన్యులకు కేటాయించనున్నారు. భక్తుల రద్దీ కారణంగా తిరుమలలోని 7600 గదులతో పాటు వివిధ మఠాల్లోని 60 శాతం గదులును టీటీడీ ఆధీనంలోకి తీసుకుంది. ఇక 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా అధికారులు సిద్దంగా ఉంచారు. ఈ నెల 19వ తేదీన జరిగే గరుడ సేవకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్యాలరీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు ప్రత్యేక అన్నప్రసాదాలు అందించనున్నారు. ఈ మేరకు స్పెషల్ ఫుడ్ మెనూ తయారుచేశారు. పులిహోర, సాంబారన్నం, బిస్కెట్లు, బాదంపాలు, మజ్జిగ, జ్యూసులు, టీ, కాఫీ, అన్నప్రసాదాలు వంటివి అందించనున్నారు. బయట క్యూలైన్లలోని భక్తుల కోసం స్వామివారి వాహనాన్ని తూర్పు, పశ్చిమ, ఉత్తర, ఈశాన్య మూలల్లో నిలిపి దర్శనం కల్పించనున్నారు.

Follow Us