AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swapna Shastra: మీ కలలో విమానం ఇలా కనిపించిందా? అయితే, మీ భవిష్యత్ ఇలా ఉండబోతుందన్నమాట..!

Swapna Shastra: మన మనసులో తలచే విషయాలు చాలాసార్లు కలల రూపంలో బయటకు వస్తాయని, కానీ కొన్నిసార్లు కలలలో వచ్చిన వాటికి, మన ఆలోచనలకు..

Swapna Shastra: మీ కలలో విమానం ఇలా కనిపించిందా? అయితే, మీ భవిష్యత్ ఇలా ఉండబోతుందన్నమాట..!
Plane
Shiva Prajapati
|

Updated on: Jun 17, 2022 | 5:59 AM

Share

Swapna Shastra: మన మనసులో తలచే విషయాలు చాలాసార్లు కలల రూపంలో బయటకు వస్తాయని, కానీ కొన్నిసార్లు కలలలో వచ్చిన వాటికి, మన ఆలోచనలకు సంబంధం ఉండదు. అయితే చాలా మంది కొన్ని కలలు నిజమవుతాయని విశ్వసిస్తే.. మరికొందరు వాటిని కొట్టిపాడేస్తారు. ఇక కొన్ని రకాల కలలు రాకూడదని, కలలో కొన్ని రకాల వస్తువులు కనిపించకూడదని అంటుంటారు. ఎందుకంటే.. కలల శాస్త్రం ప్రకారం కొన్ని కలలకు అర్థం ఉంటుంది. ఆ కలలు నీజ జీవితంలో ప్రభావం చూపుతాయని కలల శాస్త్రం పేర్కొంటోంది. సాదారణంగా కలలో ఏవైనా వస్తువులు కనిపిస్తే దానికి ప్రత్యేక అర్థం ఉంటుందని చెబుతోంది కలల శాస్త్రం. ఇవాళ మనం మీకు కలలో విమానం కనిపిస్తే దాని అర్థం ఏంటో తెలుసుకుందాం. కలలో విమానం కనిపిస్తే మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అనేది చూద్దాం..

విమానంలో ప్రయాణం.. మీ కలలో మీరు విమానంలో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తే.. మీ కలలు కొన్ని త్వరలో నెరవేరుతాయని అర్థం. ఇది మీ పనిలో గొప్ప విజయాన్ని సూచిస్తుంది. ఇది చాలా పవిత్రమైన కలగా పరిగణించబడుతుంది.

రన్‌వేపై ఉన్న విమానం కనిపిస్తే.. మీ కలలో రన్‌వేపై నిలిచి ఉన్న విమానం కనిపిస్తే.. మీరు చాలా కాలంగా నిమగ్నమై ఉన్న పని త్వరలో పూర్తవుతుందని అర్థం. త్వరలో మీరు అలాంటి అవకాశాన్ని పొందవచ్చని దీని అర్థం. తద్వారా మీరు కొత్త ఎత్తులను అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

విమానం టేకాఫ్‌ అవుతున్నట్లు కల వస్తే.. విమానాశ్రయం నుండి విమానం టేకాఫ్‌ అవుతున్నట్లు కల రావడం మంచి సంకేతం. ఇది మీ పని విస్తరణను సూచిస్తుంది. ఇది భవిష్యత్ విజయాన్ని సూచిస్తుంది.

చాలా విమానాలు కనిపిస్తే.. మీరు కలలో చాలా విమానాలు కనిపిస్తే, మీరు త్వరలో ఆర్థికంగా బలపడతారని అర్థం. మీరు త్వరలో ధనవంతులు అవుతారని ఈ కల సూచిస్తుంది.

విమాన ప్రమాదం కనిపిస్తే.. మీ కలలో విమానం కూలిపోయినట్లు వస్తే అది అశుభకరమైన కలగా పరిగణించబడుతుంది. అంటే మీరు పూర్తి శ్రమతో చేస్తున్న పనికి ఆటంకం ఏర్పడవచ్చు. అంతేకాకుండా, ఇది మీ ఆరోగ్యం చెడిపోయిందనడానికి కూడా సంకేతం.

భారీ విమానం కనిపిస్తే.. మీ కలలో చాలా పెద్ద విమానాన్ని చూసినట్లయితే, మీ కోరికలో కొన్నింటిని మీరు ఊహించలేని విధంగా త్వరలో నెరవేరుతుందని అర్థం. ఇది అఖండ విజయానికి సంకేతం.

గమనిక: ఇది మత గ్రంధాలు, విశ్వాసాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.