Jaggi Vasudev: సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అద్భుతం.. చినజీయర్‌పై జగ్గీ వాసుదేవ్ ప్రశంసలు..
Jaggi Vasudev: చినజీయర్ స్వామి నేతృత్వంలో నిర్మించిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అద్భుతమని కొనియాడారు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్.
Jaggi Vasudev: చినజీయర్ స్వామి నేతృత్వంలో నిర్మించిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అద్భుతమని కొనియాడారు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్. బైక్ యాత్రలో భాగంగా, హైదరాబాద్ వచ్చిన ఆయన ముచ్చింతల్ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగ్గీ వాసుదేవ్.. ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన సమతామూర్తి స్పూర్తి కేంద్రం, సమానత్వ సందేశాన్ని ఇస్తోందని అన్నారు. ఇక ముచ్చింతల్‌కు వచ్చిన జగ్గీ వాసుదేవ్‌కు చినజీయర్ స్వామి ఘనస్వాగతం పలికారు. దివ్య క్షేత్రం నిర్మాణశైలని, 108 దివ్య దేశాల నమూన ఆలయాల ప్రత్యేకతను జగ్గీ వాసుదేవ్‌కు వివరించారు.
ప్రపంచంలోనే రెండో ఎత్తైన సమతామూర్తి విగ్రహం వద్దకు తీసుకెళ్లి, నిర్మించిన విధానాన్ని వివరించారు చినజీయర్ స్వామీ. ఆ తర్వాత సద్గురుకు మంగళశాసనాలు అందించారు జీయర్. ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి చినజీయర్ చేస్తున్న కృషిని అభినందించారు జగ్గీ వాసుదేవ్. ఇటు జగ్గీవాస్‌దేవ్ చేస్తున్న సేవ్‌సాయిల్ క్యాంపైన్‌ని కొనియాడారు చినజీయర్ స్వామి. 27 దేశాల మీదుగా వందరోజల పాటు 30 వేల కిలోమీటర్ల మేర యాత్ర చేయడాన్ని ప్రశంసించారు. భూమిని ఇప్పుడు కాపాడుకోకపోతే, భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు చినజీయర్ స్వామీ. సద్గురు జగ్గీ వాసుదేవ్ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతీఒక్కరిని అభినందించారాయన. జగ్గీ వాసుదేవ్‌కు సమతామూర్తి ప్రతిమను, రామానుజాచార్యల పుస్తకాలను ఇచ్చి సత్కరించి, వీడ్కోలు పలికారు.