Horoscope Today: వీరికి ప్రయాణాల్లో ఇబ్బందులు .. శ్రమాధిక్యం.. గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today (16-06-2022): వృత్తి, వ్యాపార, ఉద్యోగ ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే.. రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా, ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంటారు. వెంటనే తమ దినఫలాలు..
Horoscope Today (16-06-2022): వృత్తి, వ్యాపార, ఉద్యోగ ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే.. రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా, ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంటారు. వెంటనే తమ దినఫలాలు (Daily Horoscope)ఎలా ఉన్నాయో అని వెతుకుతారు. వెంటనే ఈరోజు తమకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడంపై దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు అంటే జూన్ 16న రాశి ఫలాల (Rashi Phalalu) ప్రకారం మొత్తం 12 రాశుల వారికి గురువారం ఎలా ఉండనుందో తెలుసుకుందాం రండి.
మేషం ఈ రాశివారికి మిశ్రమకాలం కొనసాగుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమాధిక్యం. ఇబ్బందులు పెరుగుతాయి. బంధువులు, సన్నిహితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇష్టదైవారాధన మంచిది.
వృషభం ఉత్సాహంగా పనిచేస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. కీలక విషయాల్లో అజాగ్రత్త , తొందరపాటు పనికిరాదు. కుటుంబీకులు, సన్నిహితుల నుంచి అవసరానికి తగిన సహాయం అందుతుంది. అనవసర ఖర్చులుంటాయి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. హనుమంతుడిని పూజిస్తే మేలు కలుగుతుంది.
మిథునం వీరికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త మానసిక ఆనందాన్ని ఇస్తుంది. సూర్యదైవారాధనతో మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు.
కర్కాటకం శ్రమ ఫలిస్తుంది. బంధువులు, సన్నిహితుల సహకారం ఉంటుంది. లక్ష్యాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు అందుకుంటారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మంచిది.
సింహం
ఒక శుభవార్త మనసుకు ఆనందాన్నిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో ఉన్నతాధికారుల సహకారం అందుతుంది. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
కన్య శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కీలక వ్యవహారాలు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఉన్నతాధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివుడిని పూజించాలి.
తుల కీలక వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తెలివితేటలతో ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ప్రసన్నాంజనేయస్వామిని ఆరాధిస్తే మేలు కలుగుతుంది.
వృశ్చికం నిబద్ధతో పనిచేస్తే సానుకూల ఫలితాలు అందుకుంటారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం. ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగాలి. విష్ణు నామస్మరణ మంచిది. ధనస్సు బుద్ధిబలంతో వ్యవహరించాలి. తెలివితేటలతో పనులను పూర్తిచేయగలుగుతారు. సమాజంలో మంచి పేరు వస్తుంది. కులదైవాన్ని, ఇష్టదైవాన్ని సందర్శించడం మంచిది.
మకరం కీలక వ్యవహారాలలో, విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుటుంబీకులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నచ్చినవారితో సంతోషాన్ని పంచుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచిది
కుంభం వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. నూతన పనులను ప్రారంభించడానికి ఇది సానుకూల సమయం. కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన మర్చిపోకండి.
మీనం కీలక వ్యవహారాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్యవిషయాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. అనారోగ్య సమస్యల పట్ల అలక్ష్యం నష్టం కలిగిస్తుంది. శివస్తోత్రం పఠిస్తే మేలు కలుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)