Srisaialm: శ్రీశైలంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. స్వామి, అమ్మవార్లకు టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పణ

ప్రముఖ శైవ క్షేత్రం.. ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నేడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఐదో రోజుకి చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆలయాభివ్రుద్ధికి టీటీడీ కృషి చేస్తుందని వెల్లడించారు.

Srisaialm: శ్రీశైలంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. స్వామి, అమ్మవార్లకు టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పణ
Srisailam Mallanna Brahmots
Follow us
J Y Nagi Reddy

| Edited By: Surya Kala

Updated on: Mar 05, 2024 | 12:04 PM

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున భక్తులకు వసతీ గదులను నిర్మించేందుకు శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి సహకరించేందు సిద్దంగా ఉన్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ధర్మారెడ్డి అన్నారు. శ్రీశైలంలో వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున పట్టు వస్త్రాలు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేశం సస్యశ్యామలంగా ఉండాలని శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని కోరుకున్నామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి అన్నారు

ముందుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆలయ ఈవో పెద్దిరాజు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు.

ఇవి కూడా చదవండి

టీటీడీ చైర్మన్ పట్టు వస్త్రాలను తలపై పెట్టుకొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఈఓ ధర్మారెడ్డికి శ్రీశైలం ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఈవో పెద్దిరాజు స్వామిఅమ్మవార్ల జ్ఞాపకను అందజేయగా అర్చకులు వేదపండితులు తీర్ధప్రసాదాలిచ్చి ఆశీర్వదించారు. శ్రీశైలం దేవస్థానంలో భక్తుల కోసం రెండు వందల రూములు నిర్మాణం చేసేందుకు సిద్దంగా ఉన్నామని శ్రీశైలం దేవస్థానం తరుపున లెటర్ పంపిస్తే బోర్డు మీటింగ్ లో పెట్టి తీర్మానం చేస్తామని ఈఓ ధర్మారెడ్డి అన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే