AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: అయోధ్య రామాలయంపై నోరు పారేసుకున్న తృణమూల్ ఎమ్మెల్యే.. హిందువులు వెళ్లొద్దు అంటూ పిలుపు

తారకేశ్వర్‌లోని టీఎంసీ ఎమ్మెల్యే చేసిన ఈ ప్రకటనపై పెను దుమారం చెలరేగింది. రామేందు సిన్హా చేసిన ఈ ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామేందు సిన్హా చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయం అంటూ ఖండిస్తున్నారు. రామేందు సిన్హాపై బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిందువులపై దాడులు చేసే నేచర్ పెరిగిపోయింది అంటూ సువేందు అధికారి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

Ayodhya: అయోధ్య రామాలయంపై నోరు పారేసుకున్న తృణమూల్ ఎమ్మెల్యే.. హిందువులు వెళ్లొద్దు అంటూ పిలుపు
Ayodhya Ram Mandir
Surya Kala
|

Updated on: Mar 05, 2024 | 11:38 AM

Share

అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం అంగ రంగ వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో బాల రామయ్యను భక్తులు దర్శించుకుంటున్నారు. అయితే తాజాగా రామాలయం విషయంలో టీఎంసీ ఎమ్మెల్యే రామేందు సిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ మందిరాన్ని అపవిత్ర ప్రదేశంగా అభివర్ణించారు. దీనితో పాటు పూజల కోసం ఏ హిందువు రామాలయానికి వెళ్లకూడదని పిలుపు నిచ్చారు. తారకేశ్వర్‌లోని టీఎంసీ ఎమ్మెల్యే చేసిన ఈ ప్రకటనపై పెను దుమారం చెలరేగింది. రామేందు సిన్హా చేసిన ఈ ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామేందు సిన్హా చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయం అంటూ ఖండిస్తున్నారు.

రామేందు సిన్హాపై బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిందువులపై దాడులు చేసే నేచర్ పెరిగిపోయింది అంటూ సువేందు అధికారి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో వారి అసలు నైజం ఇదే అంటూ బీజేపీ నేత సువేందు చెప్పారు. అంతేకాదు ఓ హిందువులపై దాడులు చేస్తూనే ఉన్నారు.. మరోవైపు టీఎంసీ నేతల ధైర్యం ఎంతగా పెరిగిపోయిందంటే.. శ్రీ రాముని మహాదేవాలయాన్ని ‘అపవిత్రం’ అని పిలుచుకునే ధైర్యం కూడా వచ్చేసింది. రోజు రోజుకీ హిందువులపై దాడులు చేసే దైర్యం ఎక్కువైందని చెప్పారు.

రామమందిరం అపవిత్రమని తారకేశ్వర్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ వ్యాఖ్యానించారు. అలాంటి అపవిత్ర ప్రదేశంలోని ఆలయంలోని దైవాన్ని భారతీయ హిందువులు ఎవరూ పూజించకూడదని కూడా ఆయన అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు భగవంతుడు శ్రీరాముని పట్ల TMC నాయకత్వ భావాన్ని వెల్లడిస్తుంది.

తారకేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే – రామేందు సిన్హా రాయ్ 2024 यह है तृणमूल कांग्रेस के नेताओं की सच्चाई। हिन्दुओं पर आक्रमण करते करते उनकी हिम्मत इतनी बड़ गई है कि वह अब भगवान श्री राम के भव्य मंदिर को ‘अपवित्र’ बताने की धृष्टता कर रहे हैं।

तारकेश्वर विधानसभा क्षेत्र के विधायक – रामेंदु सिन्हा रॉय, जो आरामबाग संगठनात्मक जिले के टीएमसी… pic.twitter.com/RZ95yPDY5V

— Suvendu Adhikari (Modi Ka Parivar) (@SuvenduWB) March 4, 2024

టీఎంసీ ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు సన్నాహాలు

టీఎంసీ ఎమ్మెల్యే చేసిన ప్రకటనను తాను తీవ్రంగా ఖండించడమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి కూడా సిద్ధమవుతున్నాను అని అధికారి తెలిపారు. రామేందు సిన్హా ఆరంబాగ్ సంస్థాగత జిల్లా TMC అధ్యక్షుడు కూడా..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..