AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Rama Navami: రాముడు ఎప్పుడు, ఎలా తన అవతారాన్ని చాలించాడు? ఎలా స్వర్గానికి చేరుకున్నాడో తెలుసా?

భూమ్మీద పుట్టిన వారందరూ ఏదో ఒకరోజు మనిషి అయినా, ప్రాణి అయినా, దేవత అయినా మరణించడానికి కారణం జీవిత చక్రమే. రాముడి భార్య అంటే సీతమ్మ తల్లి గురించి అందరికీ తెలుసు.. సీతాదేవి తిరిగి అత్తవారింటికి వెళ్లకుండా తన తల్లి భూదేవి చెంతకు చేరుకుంది.

Sri Rama Navami: రాముడు ఎప్పుడు, ఎలా తన అవతారాన్ని చాలించాడు? ఎలా స్వర్గానికి చేరుకున్నాడో తెలుసా?
Ramavataaram
Surya Kala
|

Updated on: Mar 30, 2023 | 10:32 AM

Share

సనాతన హిందూ సంప్రదాయంలో రాముడి పేరు జీవితం ప్రారంభం నుండి చివరి వరకు అనుసంధానించబడిన గొప్ప మంత్రం. హిందూ మత విశ్వాసం ప్రకారం.. రామ నామ తారక మంత్రం అన్ని దుఃఖాలను తొలగించి, సకల సంతోషాలను కలిగిస్తుంది. పురాణాల  నమ్మకం ప్రకారం.. శ్రీరాముడు సూర్యవంశ రాజు. అయోధ్య రాజు దశరథుడి, కౌసల్య  దంపతుల తనయుడు. త్రేతాయుగంలో శ్రీ విష్ణువు  ఏడవ  అవతారంగా భావించే శ్రీరాముడు చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజు అంటే నవమి రోజున  మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు.

శ్రీ మహా విష్ణువు తన ఏడవ అవతారంగా మానవ రూపం దాల్చాడు. తద్వారా భూమిపై మత స్థాపన, అధర్మాన్ని  నాశనం చేసి సత్యం ధర్మం నెలకొల్పాడు. శ్రీ రాముడు తన జీవితకాలంలో అధర్మాన్ని నాశనం  చేస్తూ.. మానవులకు దోషాలను, పాపాలను తొలగించి మోక్షాన్ని ఇచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా పురుషోత్తముడు, గొప్ప వీరుడుగా శ్రీరాముడిని పూజిస్తున్నారు. పురుషులందరిలో ఉత్తముడు.  ప్రతి మతానికి చెందిన వారు తమ ఇంట్లో రాముడి వంటి విధేయత, సద్గుణ సంపన్నుడైన కుమారుడు ఉండాలని కోరుకోవడానికి ఇదే కారణం.

రాముడు ఎప్పుడు అవతారం చాలించాడంటే..? 

ఇవి కూడా చదవండి

మానవ జీవిత సత్యం ఏమిటంటే.. భూమిపై జన్మించిన ప్రతి జీవికి మరణం తథ్యం. పుట్టిన జీవి ఎప్పటికైనా గిట్టక తప్పదు. మరణం అనేది ఒక నిజం.. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవలసి మరణించి దేహం చాల్సించాలిందే. భూమ్మీద పుట్టిన వారందరూ ఏదో ఒకరోజు మనిషి అయినా, ప్రాణి అయినా, దేవత అయినా మరణించడానికి కారణం జీవిత చక్రమే. రాముడి భార్య అంటే సీతమ్మ తల్లి గురించి అందరికీ తెలుసు.. సీతాదేవి తిరిగి అత్తవారింటికి వెళ్లకుండా తన తల్లి భూదేవి చెంతకు చేరుకుంది. భూమి రెండుగా చీలి.. సీతను తనలో ఐక్యం చేసుకుంది. అయితే రాముడు ఎప్పుడు మరణించాడు అనే ప్రశ్న ఉదయిస్తే.. స్వామి సత్యేంద్ర దాస్  రాముడు తన అవతారాన్ని చలించడానికి కారణం, విధానాన్ని వివరించాడు. వాల్మీకి రామాయణంలో స్వర్గం ఉంది.. అయితే రాముడు  మరణించిన తేదీ ఎవరికీ స్పష్టంగా తెలియదు.

రాముడు స్వర్గానికి ఎలా వెళ్ళాడంటే 

రాంలాలా పూజారి స్వామి సత్యేంద్ర దాస్ ఈ సంస్కృత శ్లోకానికి ఒక ఉదాహరణ ఇస్తూ.

దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ |
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ||

ఈ శ్లోకం రాముడి చివరి ఘడియలు ఎలా జరిగాయో తెలుస్తుందని అన్నాడు. రాముడు అయోధ్యలోని గుప్తర్ ఘాట్‌కి వెళ్లి, సరయు నదిలోకి ప్రవేశించిన వెంటనే.. రాముడు రెండు చేతుల నుండి విష్ణువుగా మారాడు. నాలుగు చేతులు శేష తల్పం పాలకడలి.. ఉన్న విష్ణువు రూపంలోకి మారిపోయాడు. హిందూ విశ్వాసం ప్రకారం.. రాముడు తన అవతారం చాలించి విష్ణువుగా మారే సమయంలో.. సృష్టి కర్త బ్రహ్మ ఒక విమానంలో రాగా.. శ్రీ మహా విష్ణువు  ఆ విమానంలో కూర్చుని తన సర్వోన్నత నివాసానికి వెళ్లాడని విశ్వాసం.

కథ ఏమి చెబుతుందంటే?

హిందూ విశ్వాసం ప్రకారం.. రాముడు సరయూ నదిలోని జల సమాధి ద్వారా వైకుంఠంలోని తన నివాసానికి చేరుకున్నాడు. సీత దేవి  భూమిలోకి ప్రవేశించిన అనంతరం.. రామ లక్ష్మణులు అవతారం చలించే సమయం వచ్చింది. కాలపురుషుడు మారువేషంలో వచ్చి రాముడిని కలవాలని కోరినప్పుడు.. అన్న రామయ్య గదికి కావాలా ఉన్న లక్ష్మణుడు ఎవరినీ లోపలి పంపించలేదు. ఎందుకంటే తన అంతరిక సమావేశం సమయంలో లోపలి ఎవరినీ పంపించవద్దు అని రాముడు ఆజ్ఞాపించడమే.. అయితే కాల పురుషుడి రాకను అన్న రామయ్యకు చెప్పడానికి అన్న ఆజ్ఞను దిక్కరించి వెళ్లాల్సి వచ్చింది లక్ష్మణుడికి. దీంతో రాముడు తన ఆజ్ఞను ఉల్లంగించిన లక్షణుడికి మరణశిక్ష విధించడానికి బదులు రాజ్య బహిష్కరణ విధించాడు.లక్ష్మణుడు తన సోదరుడు రాముడి ఆజ్ఞానుసారం రాజ్యం విడిచి.. సరయు నదిలో కలిసిపోయాడు. దీని తరువాత, రాముడు కూడా సరయు వద్దకు వెళ్లి తన మానవ రూపాన్ని విడిచిపెట్టాడు.

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)