AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skanda Shashti 2025: రేపే స్కంద షష్టి.. ఈ వస్తువులను దానం చేయండి.. చేపట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతం..

తెలుగు నెలలోని ప్రతి నెల శుక్ల పక్ష షష్ఠి తిథిని స్కంద షష్ఠి అని అంటారు. ఈ తిధి శివుడు కుమారుడైన కార్తికేయుడికి అంకితం చేయబడింది. ఈ రోజు ఆయనని పూజిస్తారు. ఉపవాసం చేస్తారు. అంతేకాదు ఈ రోజున దానధర్మాలు చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున దానం చేయడం ద్వారా కార్తికేయుడు సంతోషిస్తాడు. దీంతో ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయని నమ్మకం. అంతేకాదు జీవితంలో ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని విశ్వాసం.

Skanda Shashti 2025: రేపే స్కంద షష్టి.. ఈ వస్తువులను దానం చేయండి.. చేపట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతం..
Skanda Shashti 2025
Surya Kala
|

Updated on: Mar 03, 2025 | 10:31 AM

Share

స్కంద షష్టి హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ప్రతి నెలా శుక్ల పక్ష షష్ఠి తిథిని స్కంద షష్టిగా జరుపుకుంటారు. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా భక్తుల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు నెలకొంటాయని శాంతి లభిస్తుందని నమ్మకం. సుబ్రమణ్య స్వామి భక్తులకు స్కంద షష్ఠి చాలా ముఖ్యమైనది. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పండుగ బలం, విజయం, ధైర్యానికి చిహ్నం.

దృక్ పంచాంగం ప్రకారం, ఫాల్గుణ మాసం శుక్ల పక్షం షష్ఠి తిథి మార్చి 4వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:16 గంటలకు ప్రారంభం అవుతుంది. మర్నాడు మార్చి 5వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12:51 గంటలకు షష్టి తిధి ముగుస్తుంది. ఈ నేపధ్యంలో స్కంద షష్టి ఉపవాసం మార్చి 4న చేయాల్సి ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. అంతేకాదు ఈ రోజున కొన్ని దానాలు చేయడం వలన సుఖ సంతోషాలు లభిస్తాయని వెల్లడించారు.

స్కంద షష్ఠి రోజున వేటిని దానం చేయాలంటే

  1. స్కంద షష్ఠి రోజున పండ్లు దానం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. సుబ్రహ్మణ్యం స్వామి అనుగ్రహం లభిస్తుంది.
  2. పాలు దానం చేయడం వల్ల జ్ఞానం, తెలివితేటలు పెరుగుతాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. పెరుగు దానం చేయడం వల్ల ఆయుస్సు, ఆరోగ్యం పెరుగుతాయి.
  5. పేదలకు ఆహార ధాన్యాలు దానం చేయడం ద్వారా అన్నపూర్ణ దేవి ఆశీస్సులు లభిస్తాయి.
  6. పేదలకు బట్టలు దానం చేయడం వల్ల జీవితంలో సుఖం, సంతోషం లభిస్తాయి.
  7. నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు శాంతిని పొందుతారు. మోక్షాన్ని పొందుతారు.
  8. బెల్లం, నెయ్యి దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుంది.
  9. నీటిని దానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దాహంతో ఉన్నవారికి మీరు నీటిని అందించవచ్చు లేదా బహిరంగ ప్రదేశాలలో తాగు నీటి స్టాళ్లను ఏర్పాటు చేయవచ్చు.
  10. పేదలకు దుప్పట్లు దానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

  1. దానం చేసేటప్పుడు… ఎల్లప్పుడూ శ్రద్ధ, భక్తి భావన ఉండాలి.
  2. దానధర్మాలు పేదవారికి, ఆపన్నులకు చేయాలి.
  3. దానం చేసే సమయంలో నేను గొప్ప వంటి ఎటువంటి అహంకారం భావం ఉండకూడదు
  4. దానధర్మాలు ఎల్లప్పుడూ రహస్యంగా చేయాలి.

స్కంద షష్ఠి ప్రాముఖ్యత

స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని పూజించడం వలన భక్తుల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ చేసే పూజ, వ్రతం, ఉపవాసం వలన కోపం, దురాశ, అహంకారం, కామం వంటి చెడు గుణాలు తొలగి సంతోషకరమైన జీవితాన్ని గడిపేలా చేస్తుంది. పురాణ గ్రంథాల ప్రకారం స్కంద షష్ఠి రోజున కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. కనుక ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థానం లభిస్తుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపినవిషయాలు పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.