దంపతుల మధ్య విబేధలా.. ఆనందం కోసం సీతా నవమి రోజున చేయాల్సిన పూజ, వ్రత విధానం మీ కోసం
సీతా నవమిని వ్రతం చేయడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతుంది. అంతేకాదు ఆమె ఆనందం, శ్రేయస్సును పొందుతాడు. సంతానం పొందాలనే కోరిక నెరవేరుతుంది. పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. వివాహిత స్త్రీలందరికీ ఈ ఉపవాసం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కోరుకుంటే, జీవితంలో శ్రేయస్సు సాధించాలనుకుంటే ఖచ్చితంగా సీతా నవమి వ్రతాన్ని ఆచరించండి.
హిందూ మతంలో వైశాఖ మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదవ రోజున సీతా నవమి ఉపవాస దీక్ష చేపడతారు. సీతాదేవి ఈ రోజున జన్మించింది. సీతా నవమి రోజున సీతామాతను పూజించడం వల్ల జీవితంలోని దుఃఖాలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ సంవత్సరం సీతా నవమి మే 16, గురువారం. సీతా నవమి రోజున సీతామాతని పూజించడం, ఈ రోజుకి సంబంధించిన వ్రత కథను చదవడం ద్వారా ప్రజలు పాపాల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు.
సీతా నవమి పురాణ కథ
పురాణాల ప్రకారం మార్వార్ ప్రాంతంలో దేవదత్ అనే బ్రాహ్మణుడు నివసించాడు. అతని భార్య శోభన చాలా అందంగా ఉంది. ఒకవైపు బ్రహ్మ దేవదత్ పూజలు చేస్తూ, పుణ్యకార్యాల్లో మునిగిపోతుంటే మరోవైపు అతని భార్య శోభన మాత్రం ప్రపంచంలోనే తానే అందం గత్తేనని భావించేవిది. బ్రాహ్మణుని భార్య తన అందం గురించి గర్విస్తూ ఇతరులతో తరచుగా తప్పుగా ప్రవర్తించేది. ఇతరులను తనకంటే తక్కువగా నీచంగా చూసేది.
ఒకరోజు శోభన కంటే చాలా అందంగా ఉన్న కొంతమంది అమ్మాయిలు గ్రామానికి వచ్చారు. ఆమెకు ఇది ఇష్టం లేదు. కోపం, అసూయతో ఆమె గ్రామం మొత్తాన్ని తగలబెట్టింది. దీని తరువాత కాల క్రమంలో ఆ బ్రాహ్మణి కూడా మరణించింది. తరువాతి జన్మలో ఆమె చండాలిగా జన్మ ఎత్తింది. ఆమె జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం ప్రారంభించింది.
ఆమె ఎప్పుడూ అవమానాన్ని పొందింది. అయితే ఈ జన్మలో ఆమె సీతా దేవికి గొప్ప భక్తురాలు. ఒకరోజు సీతామాత విగ్రహం ముందు చండాలీ తన కష్టాలను చెప్పుకుంది. అప్పుడు చండాలికి సీతామాత అనుగ్రహం వల్ల తన పూర్వ జన్మ జ్ఞప్తికి వచ్చింది. చండాలి చాలా బాధపడి పశ్చాత్తాపడి వైశాఖ మాసం నవమి రోజున ఉపవాసం చేసి పూజ చేసింది. సీతాదేవి భక్తికి సంతసించి క్రమంగా పాపాలను పోగొట్టుకుంది. అప్పటి నుంచి సీతా నవమి రోజున సీతాదేవిని పూజించడం మొదలు పెట్టారు.
సీతా నవమి ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు
సీతా నవమిని వ్రతం చేయడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతుంది. అంతేకాదు ఆమె ఆనందం, శ్రేయస్సును పొందుతాడు. సంతానం పొందాలనే కోరిక నెరవేరుతుంది. పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. వివాహిత స్త్రీలందరికీ ఈ ఉపవాసం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కోరుకుంటే, జీవితంలో శ్రేయస్సు సాధించాలనుకుంటే ఖచ్చితంగా సీతా నవమి వ్రతాన్ని ఆచరించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు