నా పర్మిషన్ లేకుండా ఎందుకు కన్నారు.. తల్లిదండ్రులపై కేసు పెట్టిన మహిళ..

ఎప్పుడైనా చిన్న పిల్లలు తమ ఫ్యామిలీ ఆల్బం చూస్తూ.. తమ తల్లిదండ్రుల పెళ్లి ఫోటోలు చూస్తే.. ఇందులో నేను ఎందుకు లేను అంటూ అమాయకంగా అడిగిన సందర్భాల గురించి వింటూనే ఉన్నాం. అయితే ఎప్పుడూ ఎ పిల్లలు తమ తల్లిదండ్రులను 'నన్ను ఎందుకు పుట్టించావు?' అని ప్రశ్నించి ఉండరు. ఇలాంటి ప్రశ్నలు ఏ సినిమాల్లోనో, కథల్లోనో విని నవ్వుకుంటాం.. అయితే ఇలాంటి ఘటన నిజ జీవితంలో చోటు చేసుకుంది. అంతేకాదు ఆగ్రహించిన ఆ మహిళ తనను అడగకుండానే తనకు జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులపై కేసు పెట్టింది.

నా పర్మిషన్ లేకుండా ఎందుకు కన్నారు.. తల్లిదండ్రులపై కేసు పెట్టిన మహిళ..
Us Woman Sued Her ParentsImage Credit source: TikTok/@isatandstared
Follow us

|

Updated on: May 13, 2024 | 2:53 PM

ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు తమ జీవితం గురించి తామే ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఒకొక్కసారి అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానా అని కూడా కొందరు తమని తామే ప్రశ్నించుకుంటూ ఉంటారు. అదే విధంగా ఎప్పుడైనా చిన్న పిల్లలు తమ ఫ్యామిలీ ఆల్బం చూస్తూ.. తమ తల్లిదండ్రుల పెళ్లి ఫోటోలు చూస్తే.. ఇందులో నేను ఎందుకు లేను అంటూ అమాయకంగా అడిగిన సందర్భాల గురించి వింటూనే ఉన్నాం. అయితే ఎప్పుడూ ఎ పిల్లలు తమ తల్లిదండ్రులను ‘నన్ను ఎందుకు పుట్టించావు?’ అని ప్రశ్నించి ఉండరు. ఇలాంటి ప్రశ్నలు ఏ సినిమాల్లోనో, కథల్లోనో విని నవ్వుకుంటాం.. అయితే ఇలాంటి ఘటన నిజ జీవితంలో చోటు చేసుకుంది. అంతేకాదు ఆగ్రహించిన ఆ మహిళ తనను అడగకుండానే తనకు జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులపై కేసు పెట్టింది. సహజంగానే ఇది చదివిన తర్వాత ఎవరైనా సరే ఇది నిజమేనా అని ఆలోచిస్తారు. కానీ ఇది ముమ్మాటికి నిజం.

indy100 నివేదిక ప్రకారం న్యూజెర్సీకి చెందిన కాస్ థియాజ్ అనే యువతి తన తల్లిదండ్రులు తన అనుమతి లేకుండా తనకు జన్మనిచ్చి.. నేరానికి పాల్పడ్డారు అంటూ.. తన తల్లిదండ్రులపై కేసు పెట్టినట్లు పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. థియాజ్ స్వయంగా తల్లి కూడా కావడం.

ఇవి కూడా చదవండి

ఆ మహిళ టిక్‌టాక్‌లో ఒక వీడియోను షేర్ చేసి.. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను.. అది నా తల్లిదండ్రుల కారణంగా.. నాకు జన్మనిచ్చే ముందు.. నేను ఈ ప్రపంచంలోకి రావాలనుకుంటున్నానా లేదా అని కూడా వారు ఆలోచించలేదు. ప్రసవించే ముందు తల్లిదండ్రులు తనకు చెప్పలేదని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే TikToker థియాజ్ బయో ప్రకారం.. ఆమె ఖాతా ‘వ్యంగ్యం’ ఆధారంగా ఉంది. అటువంటి పరిస్థితిలో ఆమె ఫాలోవర్స్ చాలా మంది ఆమె చెప్పేది నిజమా లేదా జోకా అని తేల్చుకోలేక అయోమయంలో పడ్డారు. అయితే దీని తర్వాత థియాజ్ చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు.

థియాజ్ మాట్లాడుతూ నేను పెద్దయ్యాక జీవనోపాధి కోసం పని చేయాల్సి వస్తుంది.. అంతేకాదు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం నాకు ఇబ్బంది కరంగా ఉంది. నేను అందుకనే తన తల్లిదండ్రులను కోర్టుకు లాగానని చెప్పింది. అయితే ఓ బిడ్డకు తల్లి కావడంపై ప్రశ్న తలెత్తడంతో.. ఆ బిడ్డను దత్తత తీసుకున్నట్లు చెప్పింది.

పిల్లలను కనడం అనైతికమని మహిళ చెప్పింది. అయితే మీరు ఒక బిడ్డను దత్తత తీసుకున్నప్పుడు.. అది భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లవాడు ఈ లోకంలోకి ఎలా వచ్చాడో అది నీకు తెలియదు. అది నీ తప్పు కాదు. తన బిడ్డ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ మంచి వ్యక్తిగా ఎదిగేలా చేయడానికి ప్రయత్నిస్తున్నానని ఆ మహిళ తెలిపింది.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

View this post on Instagram

A post shared by Kass Theaz (@isatandstared)

అంతేకాదు తమకు పుట్టబోయే బిడ్డ గురించి అన్నీ ఆలోచించి మానసికంగా ప్రశ్నించుకోవాలని థియాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఆమె వింత డిమాండ్ విన్న నెటిజన్లు థియాజ్ ను ట్రోల్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..