Scorpion sting: తేలు కుట్టిన చోట ఉల్లిపాయ రుద్దితే విషం విరిగిపోతుందా..?
సాధారణంగా వ్యవసాయ పనులలో రైతులకు, ఇతర వ్యవసాయ కూలీలకు పాములతో ప్రమాదం పొంచి ఉంటుంది. అత్యంత అరుదుగా తేలు కాటేయడం ద్వారా వారు ప్రమాదంలో పడుతూ ఉంటారు. తేలు కుడితే మనిషి ప్రాణం పోతుందా..? ప్రాణాంతకమా..? తెలుసుకుందాం పదండి.....
తేలు కుడితే అస్సలు లైట్ తీసుకోవద్దు. పాముతో పోల్చుకుంటే తేలు విషం తక్కువ ప్రమాదకరమైనదే అయినా.. కొన్నిసార్లు ప్రాణం పోవచ్చు. తేలు అనే విష కీటకం అరాగ్నిడా జంతు తరగతిలో స్కార్పియానిడా వర్గానికి చెందిన జీవి. వీటిలో 1500 వందల రకాల జాతులున్నాయి. తొలుత తేలు కుట్టగానే.. తీవ్రమైన మంట, నొప్పి ఉంటాయి. కొంతమందికి కుట్టన ప్రాంతంలో పాటు ఆ కాలు లేదా చేయి మొత్తం పెయిన్ ఉంటుంది. ఒకరోజు వరకు ఈ నొప్పి ఉంటుంది. తేలు కాటుకు వెంటనే చికిత్స అందిస్తే అది ప్రాణాంతకం కాదు. పల్లెలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ తేలు కుడితే నాటు వైద్యుల్నే ఆశ్రయిస్తున్నారు. 30 వరకు ప్రాణాంతకమైన విషాన్ని విడుదల చేయగల ప్రమాదకర జాతుల తేళ్లు ఉన్నాయి అని.. అవి కుడితే ప్రాణాలు పోతాయని వైద్య నిపుణుల చెబుతున్నారు.
తేలు కుట్టిన వెంటనే ఉల్లిపాయ సగానికి కోసి తేలు కుట్టిన చోట రుద్దుతూ ఉంటే 5 నిమిషాల్లోనే తేలు విషం విరిగిపోతుందని కొందరు చెబుతుంటారు. ఇది కరెక్ట్ కాదు.. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఉల్లిపాయలో వాపుని తగ్గించే గుణం ఉన్నప్పటికీ, ఇది తేలు కాటుకి సమర్ధవంతంగా పనిచేయకపోవచ్చు. కొన్ని జాతులకు చెందిన తేళ్ళ విషం ప్రాణాంతకమైనదిగా ఉంటుంది. మీరు ఇలాంటి సోషల్ మీడియా చిట్కాలను నమ్మి.. చికిత్స తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం. అగ్గిపుల్లలకు ఉండే పొడిని.. నీటిలో కలిపి తేలు కుట్టని చోట రాస్తే వెంటనే.. విషం పోతుందని ప్రచారంలో ఉంది. దీనికి కూడా ఎలాంటి శాస్త్రీయ నిబద్ధత లేదు. దయచేసి ఇలాంటి నాటు పద్దతలు పాటించవద్దు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..