క్యాన్సర్ చివరి దశలో వృద్ధురాలు.. స్ట్రెచర్‌పై వచ్చి ఓటు వేసిన బాధ్యత గల పౌరురాలు

ఓటు వేయాలనే స్పృహ ఉన్నవారు ఏ పరిస్థితిలో నున్నా సరే ఓటు వేయడానికి వచ్చిన ఉదాహరణలు మనం ఎన్నో చూశాం. అదే సమయంలో కొంతమంది ఓటు వేయడానికి నిర్లక్ష్యం చేసేవారి గురించి వింటున్నాం.. అయితే తాజాగా బీహార్‌లోని దర్భంగాలో క్యాన్సర్‌ చివరి దశలో ఉన్న వృద్ధురాలి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె తన జీవితపు చివరి ఘడియలను లెక్కిస్తోంది. అయినా ఆమె ఓటు వేయడానికి వచ్చింది. స్ట్రెచర్‌పై ఓటింగ్ బూత్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ ఓటు వేసి తన బాధ్యతను నిర్వర్తించింది ఆమె.

క్యాన్సర్ చివరి దశలో వృద్ధురాలు.. స్ట్రెచర్‌పై వచ్చి ఓటు వేసిన బాధ్యత గల పౌరురాలు
Cancer Old Woman Came On Stretcher To Cast Her Vote
Follow us

|

Updated on: May 13, 2024 | 2:22 PM

ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండగ ఎన్నికల పండగ. ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత. దేశ భవిష్యత్తు నిర్ణయించే హక్కు ఓటు ద్వారా ప్రతి పౌరుడికి ఉంది. అందుకనే వృద్ధులైన, వివాహమైనా, పరీక్షలైనా సరే ఓటు వేయాలనే స్పృహ ఉన్నవారు ఏ పరిస్థితిలో నున్నా సరే ఓటు వేయడానికి వచ్చిన ఉదాహరణలు మనం ఎన్నో చూశాం. అదే సమయంలో కొంతమంది ఓటు వేయడానికి నిర్లక్ష్యం చేసేవారి గురించి వింటున్నాం.. అయితే తాజాగా బీహార్‌లోని దర్భంగాలో క్యాన్సర్‌ చివరి దశలో ఉన్న వృద్ధురాలి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె తన జీవితపు చివరి ఘడియలను లెక్కిస్తోంది. అయినా ఆమె ఓటు వేయడానికి వచ్చింది. స్ట్రెచర్‌పై ఓటింగ్ బూత్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ ఓటు వేసి తన బాధ్యతను నిర్వర్తించింది ఆమె.

ఆ మహిళ పేరు శుభద్రాదేవి. దర్భంగా జిల్లాలోని విషన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌగ్మా గ్రామ నివాసి. కేన్సర్‌తో బాధపడుతున్న శుభద్ర దేవికి తనకు ఓటు ఉందని తెలిసింది. దీంతో తన ఓటు హక్కుని వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే తనకు కూడా ఓటు వేయాలని తన కుమారుడు విజయ్ కుమార్ మిశ్రాకు చెప్పింది. అయితే నీకు అనారోగ్యంగా ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల బూత్‌కు ఎలా వెళ్తావు? అని కొడుకు తన తల్లికి చెప్పాడు. అయితే అప్పుడు తన కొడుకుతో నేను నా బాధ్యతను నేను నిర్వర్తించాలనుకుంటున్నాను అని శుభద్రాదేవి చెప్పింది. తప్పకుండా ఓటు వేస్తాను. నన్ను అక్కడికి తీసుకెళ్లండని కోరింది.

స్ట్రెచర్ ద్వారా పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లారు

తల్లి కోరికతో ఏకీభవించిన కొడుకు తల్లిని పోలింగ్ బూత్ దగ్గరకు తీసుకుని వెళ్ళాలని భావించాడు. విజయ్ కుమార్ తల్లికి స్ట్రెచర్ ఆర్డర్ ఇచ్చాడు. అనంతరం కారులో విష్ణుయార్ చౌగ్మా మిడిల్ స్కూల్ బూత్ నంబర్ 116కి తీసుకెళ్లాడు. ఇక్కడ శుభద్రాదేవి పూర్తి ఉత్సాహంతో ఓటు వేసింది. తర్వాత తిరిగి శుభద్రాదేవిని ఇంటికి తీసుకొచ్చారు. ఈ సమయంలో బూత్ దగ్గర నిలబడి ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

‘కొన్ని నీటి చుక్కల సాయంతో బతుకుతున్న శుభద్రాదేవి

వృద్ధురాలి కుమారుడు విజయ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ‘అమ్మ తన జీవితంలోని చివరి క్షణాల్లో పౌరురాలిగా బాధ్యతను నిర్వర్తిస్తూ ఓటు వేశాసినట్లు చెప్పాడు. తన తల్లి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.. గత నాలుగు రోజులుగా కేవలం కొన్ని నీటి చుక్కలతోనే బతుకుతోంది.. అయినప్పటికీ ఓటు వేయాలని స్వయంగా కోరింది. అటువంటి పరిస్థితిలో మేము తిరస్కరించలేకపోయామని చెప్పారు. ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతూ కూడా దేశం పట్ల తన బాధ్యతను నిర్వర్తించాలంటే మనం తప్పకుండా సహాయం చేయాలని సూచించారు. తాను ఇలా ఆలోచించే మా అమ్మను స్ట్రెచర్‌పై తీసుకుని పోలింగ్ బూత్‌కు వెళ్ళినట్లు చెప్పాడు.

నాలుగో దశ ఓటింగ్

ఈ రోజు అంటే మే 13న నాల్గవ దశకు ఓటింగ్ జరుగుతోంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, బీహార్‌, మహారాష్ట్ర , జమ్మూ కాశ్మీర్ , జార్ఖండ్ , మధ్యప్రదేశ్ , ఒడిస్సా , ఉత్తర ప్రదేశ్ , వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!