CBSE Class 12th Results 2024: విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్! రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులు ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) 12వ తరగతి పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. విద్యార్ధులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు నంబర్‌లను ఎంటర్ చేసి అధికారిక వెబ్‌సైట్‌లో cbse.nic.in, cbse.gov.in, cbseresults.nic.in, results.cbse.nic.in ఫలితాలను..
న్యూఢిల్లీ, మే 13: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులు ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) 12వ తరగతి పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. విద్యార్ధులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు నంబర్‌లను ఎంటర్ చేసి అధికారిక వెబ్‌సైట్‌లో cbse.nic.in, cbse.gov.in, cbseresults.nic.in, results.cbse.nic.in ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే డీజీ లాకర్ digilocker.gov.in మొబైల్ యాప్‌ల ద్వారా కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది 10వ, 12వ తరగతుల పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగాయి.
తాజా ఫలితాల్లో 12వ తరగతిలో ఈ ఏడాదికి మొత్తం 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అమ్మాయిలు 91.52 శాతం ఉత్తీర్ణతతో అబ్బాయిల కంటే అధిక శాతం ఉత్తీర్ణత పొందారు. ఇక బాలురు 85.12 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం విద్యార్ధుల్లో 1.16లక్షల మంది విద్యార్థులకు 90 శాతం కంటే ఎక్కువ మార్కులు రావడం విశేషం. వీరిలో 24,068 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా స్కోరు సాధించారు.
తిరువనంతపురంలో అత్యధికంగా 99.91శాతం ఉత్తీర్ణత నమోదైంది. విజయవాడలో 99.04 %, చెన్నైలో 98.47 %, బెంగళూరులో 96.95 % వరుసగా ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది కంటే ఈ సారి విద్యార్ధులు 0.65 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు సీబీఎస్‌ఈ బోర్డు మెరిట్ జాబితాలను వెల్లడించడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే పదో తరగతి పరీక్షల ఫలితాలను కూడా బోర్డు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.