CUET UG 2024 Admit card: సీయూఈటీ యూజీ అడ్మిట్‌కార్డులు విడుదల.. రేపట్నుంచి పరీక్షలు
శవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ అండర్ గ్రాడ్యుయెట్ (యూజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)- యూజీ ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన వెలువరించింది. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ..
న్యూఢిల్లీ, మే 14: దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ అండర్ గ్రాడ్యుయెట్ (యూజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)- యూజీ ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన వెలువరించింది. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్లో నమోదు చేసి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా ఈ ఏడాది సీయూఈటీ పరీక్షను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇప్పటికే ప్రకటించింది. అంటే ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. మే 15 నుంచి 18 మధ్య ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. ఈ పరీక్షను తెలుగు సహా మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టుల్లో నిర్వహించనున్నారు. రేపగ్నుంచి దేశవ్యాప్తంగా 354 సిటీలు, విదేశాల్లోని 26 సిటీల్లో ఈ పరీక్ష జరగనుంది. 2024-25 విద్యాసంవత్సరానికి ఈ పరీక్ష రాసేందుకు దేశ వ్యాప్తంగా దాదాపు 13.48 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మే15న తెలంగాణ సీపీగెట్ 2024 నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీగెట్ 2024 నోటిఫికేషన్ మే 15న విడుదల చేయనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది కూడా సీపీగెట్ పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. మే 15న ఉపకులపతుల సమావేశం తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 10 కంటే తక్కువ మంది దరఖాస్తు చేసుకున్న కోర్సులను ఏదైనా కోర్సును తొలగించే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.