AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravana Masam: ఈ నెల 28వ తేదీ వెరీ వెరీ స్పెషల్.. శివ గణపయ్యలను పూజిస్తే అనుగ్రహం మీ సొంతం..

శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈ నెల ఆధ్యాత్మిక మాసం. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో ఆధ్యాత్మిక కార్యకలాపాలకు, వ్రతాలకు, నోములకు ఎంతో ప్రాముఖ్యత ఉంది, ముఖ్యంగా స్త్రీలు వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరి వ్రతం వంటి పూజలు, నోములు నోచుకుంటారు. శివ భక్తులు సోమవారాల్లో ఉపవాసాలు చేస్తారు. ఈ నెలలో శివ కేశవులను లక్ష్మిదేవి మంగళ గౌరీ లను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. అయితే ఈ శ్రావణ మాసంలో జూలై 28వ తేదీకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకు జూలై 28వ తేదీ శక్తివంతమైన రోజో తెలుసుకుందాం..

Shravana Masam: ఈ నెల 28వ తేదీ వెరీ వెరీ స్పెషల్.. శివ గణపయ్యలను పూజిస్తే అనుగ్రహం మీ సొంతం..
Shravana Masam 2025
Surya Kala
|

Updated on: Jul 20, 2025 | 3:34 PM

Share

శ్రావణ మాసంలో శివ కేశవులను లక్ష్మిదేవి మంగళ గౌరీ లను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ సంవత్సరం, జూలై 28 కోరికలను కోరుకోవడానికి.. వాటిని నెరవేర్చుకోవడానికి శక్తివంతమైన రోజు. ఎందుకు అని ఆలోచిస్తున్నారా? దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఈ రోజు శ్రావణ మాసం మొదటి సోమవారం అంతేకాదు సంకహర వినాయక చవితి. ఈ రెండు రెండు సందర్భాలు ఈ రోజును చాలా ప్రత్యేకమైనవిగా చేస్తున్నాయి. భక్తులు నిర్మల మైన హృదయంతో తమకు కావలసినది కోరుకోవచ్చు. శివుడు, గణేశులు సంతోషించి తన భక్తులను అనుగ్రహించే అవకాశం ఉందని నమ్మకం.

శ్రావణ మాసంలోని ప్రతి రోజూ ప్రవిత్రమైనవే.. అయితే సోమవారాలను శివుడిని పూజించే పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఎందుకంటే శివుని ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. అంతే కాదు సంకహర వినాయక చవితి అనేది గణేశుడిని పూజించే పండుగ. జీవితంలోని అన్ని కష్టాలను, అడ్డంకులను తొలగించే దేవుడు. జూలై 28న చతుర్థి తిథి జూలై 27న రాత్రి 10:40 గంటలకు ప్రారంభమై జూలై 28న రాత్రి 11:24 గంటలకు ముగుస్తుంది. ఈ నేపధ్యంలో సంకహర వినాయక చవితిని జూలై 28న జరుపుకోవాల్సి ఉంటుంది.

శ్రావణ సోమవారం జూలై 28వ తేదీ ప్రాముఖ్యత:

  1. ఎవరైనా వివాహం, సంతానం, శాంతి, విజయం కోసం ప్రార్థిస్తుంటే.. ఈ రోజున శివుడు, గణపతిని పూజించాలి. తండ్రి తనయుడు మీ కోరికలు విని.. త్వరగా మీ కోరికలను తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
  2. వ్యాధులు, దోషాలు, పితృ శాపాల నుంచి కూడా ఈ రోజున ఉపశమనం పొందే అవకాశం ఉంది.
  3. ఇవి కూడా చదవండి
  4. ఈ రోజు మానసిక ప్రశాంతతను కూడా పెంపొందిస్తుంది. ఇది మనస్సులో స్పష్టతను తెస్తుంది.
  5. ఇది చంద్రుడు, రాహువు, కేతువు వంటి గ్రహాలను ప్రభావితం చేసే గ్రహ బాధలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
  6. స్టూడెంట్స్ పరీక్షలలో మంచి ఫలితాలు, ఉన్నత విద్యలో మంచి ఫలితాలు మొదలైన వాటి కోసం ఈరోజు శివుడు, గణపతిని ప్రార్థించవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?