- Telugu News Photo Gallery Spiritual photos Vastu tips for home: What to keep in east corner of house according to vastu shstra for Wealth and Prosperity
East Vastu Tips: ఆరోగ్యంగా ఉండాలన్నా, డబ్బుకి ఇబ్బందులు తొలగాలన్నా ఇంటి తూర్పు దిక్కులో వీటిని ఉంచండి..
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణంలో దిక్కు (దిశ)లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒకొక్క దిశ ఒకొక్క దేవుడికి సంబంధించినది. ఇంటి తూర్పు దిశను సూర్య భగవానుడి దిశగా పరిగణిస్తారు. ఇది శక్తి, ఆరోగ్యం, శ్రేయస్సుకు చిహ్నం. అందుకనే ఎక్కువ మంది తమ ఇంటి ప్రధాన ద్వారాన్ని తూర్పు దిక్కుకు ఉండేలా నిర్మించుకుంటారు. అయితే త్వరగా ధనవంతులు కావాలనుకున్నా, పురోగతి సాధించాలనుకున్నా వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలి.
Updated on: Jul 20, 2025 | 4:31 PM

తూర్పు దిశను దేవతలు దిశగా పరిగణిస్తారు. కనుక ఈ దిశలో కొన్ని రకాల శుభ వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో సంపద , శ్రేయస్సు వస్తుంది. తూర్పు దిశలో ఇంటి పూజా గదిని ఏర్పాటు చేసుకోవడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. తూర్పు దిశలో ఏవి ఉంచుకుంటే శుభమో తెలుసుకుందాం.

మీకు దుకాణం లేదా కార్యాలయం ఉంటే తూర్పు దిశలో ఎరుపు లేదా బంగారు రంగు సేఫ్ ఉంచండి. అందులో డబ్బు లేదా విలువైన వస్తువులను ఉంచుతారు కనుక ఇలా చేయడం ద్వారా.. మీ ఖజానా పెట్టి ఎప్పుడూ ఖాళీగా ఉండదు. డబ్బు ఎల్లప్పుడూ ఉంటుంది.

ఇంటికి తూర్పు దిశలో అద్దం ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లోని సురక్షితమైన లేదా దానానికి సంబంధించిన వస్తువులు కనిపించేలా తూర్పు దిశలో అద్దం ఉంచండి. అయితే తూర్పున పెట్టె అద్దం దక్షిణ దిశ వైపు చుపిస్తున్నట్లుగా ఉండకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేస్తే ఇంట్లో ఆర్దిక ఇబ్బందులను కలుగజేస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఇంటికి తూర్పు దిశలో నాటాలి. తూర్పు దిశలో తులసి మొక్కను నాటడం వల్ల ఇంటి నుంచి ప్రతికూల శక్తి దూరంగా ఉంటుందని, కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుందని.. ఆ ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుందని నమ్మకం.

ఇంటి తూర్పు గోడపై సూర్య భగవానుడి చిత్రం లేదా ఉదయిస్తున్న సూర్యుని చిత్రం ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, తూర్పు దిశలో ఉదయిస్తున్న సూర్యుని చిత్రాన్ని ఉంచడం వల్ల జీవితంలో కొత్త శక్తి, హోదా, ప్రతిష్ట ,విజయం లభిస్తుంది.

సనాతన ధర్మం ప్రకారం ఇంటి తూర్పు దిశలో ఏడు పరిగెత్తే గుర్రాల చిత్రాన్ని ఉంచాలి. తూర్పు దిశలో ఏడు పరిగెత్తే గుర్రాల చిత్రాన్ని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అది పురోగతికి దారితీస్తుంది.




