- Telugu News Photo Gallery Yoga Poses for Height Increase: these Yoga Poses to Naturally Increase Children Height and Growth
Yoga for Kids: పిల్లల ఎత్తు పెరగడం లేదని దిగులా.. ఈ యోగాసనాలు నేర్పించండి.. ఆరోగ్యం, హైట్ రెండూ పిల్లల సొంతం
పిల్లల ఎత్తు పెరుగుదల జన్యుశాస్త్రంపై అంటే తల్లిదండ్రులు ఎంత ఎత్తులో ఉన్నారనే విషయంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అయితే పిల్లల పెరుగుదలపై ఇతర అలవాట్లు కూడా ప్రభావం చూపిస్తాయని తెలుసా.. సమతుల్య ఆహారం, శారీరక శ్రమ వంటి అనేక అంశాలు పిల్లల శారీరక పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు పిల్లలు క్రమం తప్పకుండా యోగా చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే యోగా ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కండరాలు బాగా సాగడానికి దారితీస్తుంది. దీంతో పిల్లలు ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. ఈ రోజు ఎత్తు పెరిగేందుకు పిల్లలు ఏ యోగాసనాలు వేయాలో ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Jul 20, 2025 | 1:55 PM

తాడాసనాన్ని "పర్వత భంగిమ" అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ ఆసనం చేస్తున్నప్పుడు.. నిలబడి ఉన్నప్పుడు శరీరాన్ని నిటారుగా ఉంచి, చేతులు పైకి చాపాల్సి ఉంటుంది. ఇది వెన్నెముకకు సానుకూల సాగతీతను అందిస్తుంది. కండరాలను సాగదీస్తుంది. ఈ యోగాసనం మొత్తం శరీరానికి మంచి సాగతీతను ఇస్తుంది. దీంతో ఈ ఆసనం పిల్లల్లో పెరుగుదల హార్మోన్లను సక్రియం చేస్తుంది. పిల్లల ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది.

భుజంగాసనం (కోబ్రా భంగిమ) చేయడం చాలా సులభం. చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని చేయడం వల్ల వీపు, వెన్నెముకలో వశ్యత పెరుగుతుంది. ఊపిరితిత్తులకు, జీర్ణక్రియకు, గుండెకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఆసనంలో కడుపుపై పడుకోవాలి. అరచేతుల సహాయంతో శరీరం భుజాల నుంచి తలను పైకి ఎత్తాలి. ఈ భంగిమ పాడగ ఎత్తిన పాము వలెనే ఉంటుంది కనుక దీనిని కోబ్రా పోజ్ అని కూడా అంటారు. ఈ యోగాసన శరీరానికి మంచి సాగతీత ఇవ్వడం ద్వారా హార్మోన్లను సమతుల్యం చేయడానికి కూడా పనిచేస్తుంది. దీని కారణంగా ఇది ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది.

త్రికోణాసనం .. దీనిని త్రిభుజాకార భంగిమ అని కూడా అంటారు. శరీరం ఒక వైపుకు వంగి ఉంటుంది. ఇది పక్క శరీరం, వెన్నెముక , కాలు కండరాలను సాగదీస్తుంది. ఈ సాగతీత శరీర కూర్పును సమతుల్యం చేస్తుంది. ఎత్తు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ఈ ఆసనం వశ్యతను పెంచుతుంది. నడుము కొవ్వును తగ్గిస్తుంది. వెన్నెముక పొడవుకు సహాయపడుతుంది. ఇది పిల్లలకు సులభమైన, ప్రయోజనకరమైన ఆసనం.

పశ్చిమోత్తనాసనం కూడా ఎత్తు పెరగడానికి మంచి యోగాసనంగా కూడా పరిగణిస్తారు. అయితే ఈ యోగాసనం చేసే సమయంలో తొందరపడకూడదు. ఎందుకంటే ఇది కొంచెం కష్టమైన యోగాసనం. ఈ యోగా భంగిమలో ముందుగా కాళ్ళను ముందుకు చాచి కూర్చుని, శరీరాన్ని ముందుకు వంచి, పాదాలను పట్టుకుని ..నుదిటిని కాళ్ళపై ఉంచడానికి ప్రయత్నించాలి. ఈ యోగాసనం వీపు, తొడ కండరాలు, వెన్నెముకను సాగదీస్తుంది.

వృక్షాసనం చేయడం వల్ల ఎత్తు పెరగడమే కాకుండా, పిల్లల సమతుల్యత కూడా మెరుగుపడుతుంది. ఇందులో నిటారుగా నిలబడిన తర్వాత శరీరంలోని కుడి కాలును ఎడమ తొడ లోపలి భాగంలో పెట్టాలి. తర్వాత రెండు చేతులను పైకి ఎత్తి అరచేతులు కలిపి దణ్ణంగా పెట్టాలి. ఈ యోగా భంగిమ పిల్లల సమతుల్యతను మెరుగుపరచడంతో పాటు ఏకాగ్రత, శరీర భంగిమను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.




