AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఫ్రిజ్ నుంచి తీసిన ఆహారాన్ని వేడి చేసి తినడం సురక్షితమేనా?

సాధారణంగా మన ఇంట్లో ఆహారం ఎక్కవైనా, బయట నుంచి తెచ్చిన ఆహారం మిగిలినప్పుడు దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత వేడి చేసుకొని తింటుంటాం. కానీ ఇలా ఆహారాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు వేడి చేసి తినడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల వాటిలోని పోషక విలువలను తగ్గడమే కాకుండా, అవి చెడిపోయే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు.

Anand T
|

Updated on: Jul 20, 2025 | 3:22 PM

Share
మనం ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచడం సర్వసాధారణం. ఇలా పెట్టిన ఆహారాన్ని మరుసటి రోజు తీసి ఎలా తింటున్నారు? చాలా మంది ఫ్రిజ్ నుండి తీసిన ఆహారాన్ని వేడి చేసి తింటుంటారు. కానీ ఈ పద్ధతి సురక్షితమేనా? కొన్ని సందర్భాల్లో, ఇలా నిల్వ చేసి తర్వాత మళ్లీ వేడి చేసి తినడం హానికరమని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆహారాన్ని వాడుకోవడానికి పోషకాహార నిపుణులు కొన్ని చిట్కాలను చెబుతున్నారు. ఇంట్లో వండిన ఆహారాన్ని రెండు గంటల్లోపు ఫ్రిజ్‌లో ఉంచాలి. దాన్ని ఎక్కువసేపు బయట ఉంచడం వల్ల వాటిపై బ్యాక్టీరియా చేరి అది త్వరగా పాడైపోయే అవకాశం ఉందంటున్నారు. దాన్ని తినడం ఆరోగ్యానికి హానికరం కూడా

2 / 5
కొన్ని సందర్భాల్లో మనం వేడి ఆహారాన్ని డైరెక్ట్‌గా ఫ్రిజ్‌లో పెడుతూ ఉంటాం.. కాని ఇది కూడా అంత మంచిది కాదు. రెండింటికి ఉండే వ్యతిరేక ఉష్ణోగ్రతలో కారణంగా ఆహారం చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వండిన ఆహారం కాస్త చల్లారిని తర్వాత ఫ్రిజ్‌లో పెట్టడం మంచింది. ఇంకో విషయం ఏంటంటే ఫ్రిజ్‌లో పెట్టే ఆహారాన్ని ఓపెన్ కంటైనర్లలో పెట్టకూడదు.

3 / 5
ఆహారాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు వేడి చేయడం అతిపెద్ద చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఇది ఆహారంలోని పోషక విలువలను తగ్గించడమే కాకుండా,ఆహారం చెడిపోయే అవకాశం ఉందంటున్నారు. మనం ఏదైనా ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు, దానిని త్వరగా తీయడం మర్చిపోతాం..వాటిని చాలా రోజుల తర్వాత తీసుకొని వాడుకుంటాం.ఈ సమస్యను అదిగమించేందుకు మిగిలిపోయిన ఆహారంపైన తేదీని రాయడం మంచి మార్గం

4 / 5
ఇంట్లో వండిన చాలా భోజనాలు ఒకటి రెండ్రోజుల్లో తినడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పాలు లేదా క్రీమ్ ఆధారిత వంటకాలు తక్కువ షెల్ఫ్ లైఫ్ కలిగి ఉంటాయి. కాబట్టి, వాటిని 24 నుండి 48 గంటల్లోపు తినాలి. అవి కనుక చెడిపోయినట్టు అనిపిస్తే వాటిని పారవేయడానికి మంచిది.

5 / 5