Navaratri 2024: రేపే నవరాత్రుల్లో మొదటి రోజు కలశ స్థాపన శుభ సమయం, పూజా విధి, విధానం.. మీ కోసం

దుర్గా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు 9 రోజుల పాటు ఉపవాసం ఉంటారు. నవరాత్రుల మొదటి రోజు దుర్గాదేవి అవతారం అయిన శైలపుత్రికి అంకితం చేయబడింది. ఈ రోజున ఆచారాల ప్రకారం శైలపుత్రిని పూజించడం ద్వారా అమ్మవారి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్మకం. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆశ్వయుజమాసంలోని శుక్ల పక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3 న 00:18 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి అక్టోబర్ 4వ తేదీ ఉదయం 02:58 వరకు ఉంటుంది.

Navaratri 2024: రేపే నవరాత్రుల్లో మొదటి రోజు కలశ స్థాపన శుభ సమయం, పూజా విధి, విధానం.. మీ కోసం
Navaratri 1st Day
Follow us
Surya Kala

|

Updated on: Oct 02, 2024 | 2:42 PM

హిందూ మతంలో అతిపెద్ద పండుగ అయిన దేవీ నవరాత్రులు రేపు అంటే అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. నవరాత్రుల 9 రోజుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూర్తి ఆచారాలతో పూజిస్తారు. నవరాత్రుల మొదటి రోజున శుభ సమయంలో కలశం ఏర్పాటు చేసి దుర్గా దేవిని ఆవాహన చేస్తారు. ఆపై మొత్తం 9 రోజుల పాటు అమ్మవారిని 9 రకాల రూపాలను భక్తితో పూజిస్తారు. నవరాత్రులలో 9 రోజులు కూడా అఖండ జ్యోతిని వెలిగిస్తారు. దుర్గా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు 9 రోజుల పాటు ఉపవాసం ఉంటారు. నవరాత్రుల మొదటి రోజు దుర్గాదేవి అవతారం అయిన శైలపుత్రికి అంకితం చేయబడింది. ఈ రోజున ఆచారాల ప్రకారం శైలపుత్రిని పూజించడం ద్వారా అమ్మవారి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్మకం.

నవరాత్రిలో కలశం ప్రతిష్టాపన తిథి

పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆశ్వయుజమాసంలోని శుక్ల పక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3 న 00:18 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి అక్టోబర్ 4వ తేదీ ఉదయం 02:58 వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఉదయం తిథి ప్రకారం ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.

ఘట స్థాపన(కలశం ప్రతిష్టాపన) శుభ ముహూర్తం

శరన్నవరాత్రుల్లో మొదటి రోజున ఘట స్థాపనకు రెండు శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఘట స్థాపనకు మొదటి శుభ సమయం ఉదయం 6:15 నుంచి 7:22 వరకు ఉంటుంది. దీంతో ఘట స్థాపన కోసం 1 గంట 6 నిమిషాల సమయం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

కలశం ప్రతిష్టాపనకు రెండో ముహూర్తం కూడా మధ్యాహ్నం అభిజీత్ ముహూర్తంలో చేసుకోవచ్చు. ఈ ముహూర్తం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. కలశ ప్రతిష్టాపనను పగటిపూట 11:46 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు ఎప్పుడైనా చేయవచ్చు. అంటే మధ్యాహ్నం 47 నిమిషాల శుభ సమయం లభిస్తుంది.

నవరాత్రి కలశ ప్రతిష్టాపన విధి, విధానం

  1. నవరాత్రులలో ధాన్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ధాన్యాన్ని ఒక రోజు ముందు నీటిలో నానబెట్టి, మొలకెత్తనివ్వండి.
  2. మరుసటి రోజు అంటే కలశ ప్రతిష్టాపన సమయంలో పూజ గదిని గంగాజలం చల్లి శుద్ధి చేయండి.
  3. అనంతరం దుర్గా దేవి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచండి. మట్టి నీరు వేసి ధాన్యం ఉంచండి.
  4. కలశం ప్రతిష్టాపన చేసే ముందు కలశాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో లేదా ఈశాన్య మూలలో ఏర్పాటు చేసుకోవాలి.
  5. కుండలో నీరు, గంగాజలం, నాణెం, కుంకుమ, పసుపు, దర్భలు, తమలపాకులు వేసి ధాన్యంపై అమర్చండి.
  6. మామిడాకులను వేసి అనంతరం కొబ్బరికాయను ఏర్పాటు చేసుకోవాలి. ఒక పాత్రలో శుభ్రమైన మట్టిని వేసి 7 రకాల ధాన్యం వేయండి.
  7. ఘట స్థాపనతో పాటు ధూప, దీపాలను తప్పకుండా వెలిగించండి. ఎడమవైపు ధూపం, కుడివైపు దీపం వెలిగించాలి.
  8. చివర్లో దీపం వెలిగించి గణేశుడిని, దుర్గాదేవిని, నవగ్రహాలను ఆవాహన చేయండి. తర్వాత ఆచారాల ప్రకారం అమ్మవారిని పూజించాలి.
  9. కలశం పైన మామిడి ఆకులను తప్పకుండా ఉంచాలి. అలాగే ప్రతిరోజు పూలు, నైవేద్యాలు సమర్పించండి.
  10. కలశ ప్రతిష్టాపన తర్వాత పూర్తిగా 9 రోజులు పారాయణం చేయండి.
  11. పండితుడిని పిలిచిన తర్వాత మంత్రోచ్ఛారణలతో కలశ ప్రతిష్టాపన చేయాలి.

శైలపుత్రి ఆగమనం..

నవరాత్రుల మొదటి రోజున దుర్గాదేవి అవతారమైన శైలపుత్రిని పూజిస్తారు. పర్వత రాజు హిమాలయాల ఇంట్లో జన్మించినందున పార్వతిదేవికి శైలపుత్రి అని పేరు వచ్చింది. శైలపుత్రి చాలా కఠోర తపస్సు చేసి శివుడిని భర్తగా పొందింది. శైలపుత్రిని కరుణ, సహనం, ఆప్యాయతకు చిహ్నంగా భావిస్తారు. శైలపుత్రిని ఆరాధించడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. పెళ్లికాని అమ్మాయిలకు తగిన వరుడు లభిస్తాడు.. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. నవరాత్రుల మొదటి రోజున శైలపుత్రి అవతారంలో ఆచారాలతో పూజిస్తారు.

శైలపుత్రి పూజ విధి.. పూజా విధానం

  1. నవరాత్రుల మొదటి రోజున శైలపుత్రి దేవిని ఆరాధించే ముందు, ఆచారాల ప్రకారం కలశాన్ని స్థాపించి, అఖండ జ్యోతిని వెలిగించండి.
  2. గణేశుడిని, శైలపుత్రి దేవిని ఆరాధించండి. అయితే నారింజ , ఎరుపు రంగులు దేవతకు చాలా ఇష్టం.
  3. కలశం ప్రతిష్టించిన తర్వాత షోడోపచార పద్ధతి ప్రకారం శైలుపత్రి దేవిని పూజించండి.
  4. శైలపుత్రికి కుంకుడు, తెల్ల చందనం, పసుపు, అక్షతలు, కుంకుమ, తమలపాకులు, లవంగం, కొబ్బరి సహా మహిళల అలంకరణ వస్తువులను సమర్పించండి.
  5. అమ్మవారికి తెల్లటి పువ్వులు, తెల్లని స్వీట్లను సమర్పించండి.
  6. శైలపుత్రి బీజ మంత్రాలను జపించి.. ఆపై హారతిని ఇవ్వండి
  7. సాయంత్రం కూడా అమ్మవారికి హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం పంపిణీ చేయండి.

ఈ మంత్రాన్ని జపించండి

ఓం దేవీ శైలపుత్ర్యై నమః. శైలపుత్రీ ప్రార్థన. వందే వాంచితాలభ్య చంద్రార్ధకృతశేఖరం వ్రిషరూఢం శూలధరం శైలపుత్రిమ్ యశస్విన యశస్వినిమ్||

ओम देवी शैलपुत्र्यै नमः

ह्रीं शिवायै नम:

वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्। वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
తండ్రి శవాన్ని కాల్చిన బూడిదపై గంజాయి మొక్క పెంచి.. సిగరెట్లుగా
తండ్రి శవాన్ని కాల్చిన బూడిదపై గంజాయి మొక్క పెంచి.. సిగరెట్లుగా
లాస్ట్ మినిట్‌లో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన డేంజరస్ బౌలర్..
లాస్ట్ మినిట్‌లో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన డేంజరస్ బౌలర్..
అదానీ గ్రూప్‌తో విద్యుత్‌ ఒప్పందం.. క్లారిటీ ఇచ్చిన వైసీపీ
అదానీ గ్రూప్‌తో విద్యుత్‌ ఒప్పందం.. క్లారిటీ ఇచ్చిన వైసీపీ
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ డ్రామా..
కేకేఆర్ వద్దంది.. కట్‌చేస్తే.. 34 బంతుల్లో మ్యాచ్ క్లోజ్ చేశాడు
కేకేఆర్ వద్దంది.. కట్‌చేస్తే.. 34 బంతుల్లో మ్యాచ్ క్లోజ్ చేశాడు
గోల్డెన్ లగ్జరీ రైలు.. ఇందులో 7 స్టార్ హోటల్ తరహాలో సదుపాయాలు!
గోల్డెన్ లగ్జరీ రైలు.. ఇందులో 7 స్టార్ హోటల్ తరహాలో సదుపాయాలు!
దొంగలను పట్టించే ఆలయం.. ఈ విషయం తెలుసుకున్న దొంగలు ఏం చేశారంటే
దొంగలను పట్టించే ఆలయం.. ఈ విషయం తెలుసుకున్న దొంగలు ఏం చేశారంటే
మీ ఇంటి పెరట్లో ఈ మొక్క ఉంటే చాలు.. షుగర్, కీళ్ల నొప్పులకు చెక్‌
మీ ఇంటి పెరట్లో ఈ మొక్క ఉంటే చాలు.. షుగర్, కీళ్ల నొప్పులకు చెక్‌
మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో ఎవరికీ తెలియదు..
మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో ఎవరికీ తెలియదు..
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?