Sri Lanka: మనదేశంలోనే కాదు అనేక దేశాల్లో శక్తిపీఠాలున్నాయి.. రాముడు, రావణుడుతో పూజలను అందుకున్న శక్తిపీఠం ఎక్కడుందో తెలుసా..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ శక్తిపీఠాలకు వాటి సొంత ప్రాముఖ్యత, గుర్తింపు ఉన్నాయి. ఆ ఆలయాలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగింది. అలాంటి ఒక ఆలయం 51 శక్తిపీఠం గురించి తెలుసుకుందాం.. ఇక్కడ సతీదేవి శరీర భాగం పడింది. ఈ శక్తిపీఠంలో రాముడు పూజ చేశాడు. ఆ తర్వాత రావణుడితో యుద్ధం చేసి గెలిచాడు.

Sri Lanka: మనదేశంలోనే కాదు అనేక దేశాల్లో శక్తిపీఠాలున్నాయి.. రాముడు, రావణుడుతో పూజలను అందుకున్న శక్తిపీఠం ఎక్కడుందో తెలుసా..
Indraksh Shakthi Peetha
Follow us
Surya Kala

|

Updated on: Sep 28, 2024 | 3:21 PM

హిందూ మతం విశ్వాసాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు ఎక్కడ పడితే అక్కడ శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. దేవి పురాణంలో మొత్తం 51 శక్తిపీఠాల గురించి ప్రస్తావించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 51 కంటే ఎక్కువ శక్తిపీఠాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ శక్తిపీఠాలకు వాటి సొంత ప్రాముఖ్యత, గుర్తింపు ఉన్నాయి. ఆ ఆలయాలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగింది. అలాంటి ఒక ఆలయం 51 శక్తిపీఠం గురించి తెలుసుకుందాం.. ఇక్కడ సతీదేవి శరీర భాగం పడింది. ఈ శక్తిపీఠంలో రాముడు పూజ చేశాడు. ఆ తర్వాత రావణుడితో యుద్ధం చేసి గెలిచాడు.

ఈ శక్తిపీఠం ఎక్కడ ఉంది?

సతీదేవికి సంబంధించిన ఈ శక్తిపీఠం శ్రీలంకలో ఉంది. జాఫ్నాలోని నల్లూరులో ఉన్న ఈ దేవాలయం సతీదేవి పాదము పడిన ప్రదేశం అని నమ్మకం. అందుకే ఈ ఆలయాన్ని ఇంద్రాక్షి శక్తిపీఠంగా పిలుస్తారు.

రాముడు, రావణుడు పూజించిన అమ్మవారు

రాముడు, దేవతలకు రాజు ఇంద్రుడు కూడా ఈ ఆలయంలో అమ్మవారిని పూజించారు. రావణుడు శివుడు, శక్తిల గొప్ప ఆరాధకుడు. రావణుడు ఎక్కడికైనా వెళ్ళే ముందు యుద్ధం చేసే ముందు ఈ సతీదేవి ఆలయంలోని శక్తికి పూజలు చేసేవాడట.

ఇవి కూడా చదవండి

శ్రీలంకాలో పాటు ఈ దేశాల్లో శక్తిపీఠాలు

సతీదేవి శక్తిపీఠం శ్రీలంకలోనే కాదు ఇంకా అనేక దేశాల్లో కూడా ఉన్నాయి. మన పొరుగు దేశం నేపాల్‌లో రెండు శక్తిపీఠాలు ఉన్నాయి. వాటిలో మొదటిది గుహ్యేశ్వరి శక్తిపీఠం. రెండవది దంత్కాళి శక్తిపీఠం. పాకిస్థాన్‌లో హింగ్లాజ్ శక్తిపీఠం ఉంది. బంగ్లాదేశ్‌లో నాలుగు శక్తిపీఠాలు ఉన్నాయి. సుగంధ శక్తిపీఠం, కరదోయ ఘాట్ శక్తిపీఠం, చట్టాల్ శక్తిపీఠం, యశో శక్తిపీఠం

శక్తిపీఠం ఏర్పాటు వెనుక కథ ఏమిటి?

సతీదేవి శక్తిపీఠం వెనుక ఒక పురాణ కథ ఉంది. దీని ప్రకారం సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి హరిద్వార్ అని పిలువబడే కంఖాల్ అనే ప్రదేశంలో మహాయజ్ఞం చేయడం మొదలు పెట్టాడు. ఆ యాగంలో పాల్గొనేందుకు బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడితో సహా దేవతలను పిలిచాడు. అయితే తన అల్లుడైన శివుడిని ఆహ్వానించలేదు. దీంతో సతీ దేవికి ఈ విషయం తెలిసింది. తన భర్తను యాగానికి పిలవకపోవడానికి సమాధానం తెలుసుకోవడానికి.. ఆమె తన తండ్రి దక్షుడిని యాగశాల వద్దకు చేరుకుంది. సతీదేవి తన తండ్రిని ప్రశ్నించినప్పుడు.. దక్షుడు శివుడిని దుర్భాషలాడాడు. ఘోరంగా అవమానించాడు. తండ్రి చేసిన అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి ఆ యాగంలోని అగ్నిలో దూకి ఆత్మార్పణం చేసుకుంది.

ఈ సమాచారం తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడై మూడో కన్ను తెరిచాడు. సతీదేవి దేహాన్ని ఎత్తుకుని తన భుజంపై వేసుకున్నాడు. శివుని అశ్రుధారలతో భార్య శవం భుజం మీద వేసుకుని భుమండం మొత్తం తిరగడం మొదలు పెట్టాడు. భూమికి ముప్పు పెరుగుతోందని చూసిన శ్రీ మహా విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు చేశాడు. అప్పుడు సతీదేవి శరీరంలోని వివిధ భాగాలు వేర్వేరు ప్రదేశాల్లో పడిపోయాయి. ఇలా 51 ముక్కలు భూమి మీద పడ్డాయి. తద్వారా 51 శక్తిపీఠాలు ఏర్పడ్డాయని పురాణ కథనం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!