AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rare Temple: ద్వాపరయుగం నాటి గజ లక్ష్మి ఆలయం.. ప్రసాదంగా నాణెం లభిస్తే ఆర్ధిక ఇబ్బందులు తీరతాయని నమ్మకం..

దేశంలోని అనేక పురాతన దేవాలయాలు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు నివసించే నగరం. అయితే ఈ భోలేనాథ్ నగరంలో చాలా అరుదైన లక్ష్మీ దేవి ఆలయం కూడా ఉందని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ ఆలయం 2000 సంవత్సరాల పురాతనమైనది అని నమ్ముతారు. సాధారణంగా లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు లేదా గుడ్లగూబపై కూర్చున్నట్లు దర్శనం ఇస్తుంది. కానీ ఈ ఆలయంలో లక్ష్మీదేవి ఏనుగు వాహనంగా కూర్చుని ఉంది. కనుక ఈ ఆలయాన్ని గజలక్ష్మీ దేవి ఆలయం అని కూడా అంటారు.

Rare Temple: ద్వాపరయుగం నాటి గజ లక్ష్మి ఆలయం.. ప్రసాదంగా నాణెం లభిస్తే ఆర్ధిక ఇబ్బందులు తీరతాయని నమ్మకం..
Gaja Lakshmi Temple
Surya Kala
|

Updated on: Sep 27, 2024 | 4:12 PM

Share

సంపద పొందడానికి ప్రజలు లక్ష్మిదేవిని పూజిస్తారు. లక్ష్మీ దేవిని పూజించడం వల్ల మనిషి జీవితంలోని కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం. దేశవ్యాప్తంగా లక్ష్మీ దేవి ఆలయాలు చాలా ఉన్నప్పటికీ.. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కొన్ని ఆలయాలు ప్రధాన ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాంటి దేవాలయం మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ లక్ష్మీ దేవి తన వాహనమైన గుడ్లగూబపై ఉండదు. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఏనుగుపై స్వారీ చేస్తూ భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ ఆలయం వెనుక ఉన్న పురాణ విశ్వాసం ఏమిటో తెలుసుకుందాం.

ఈ ఆలయం ఎక్కడ ఉంది మరియు దానిని ఎలా చేరుకోవచ్చు?

దేశంలోని అనేక పురాతన దేవాలయాలు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు నివసించే నగరం. అయితే ఈ భోలేనాథ్ నగరంలో చాలా అరుదైన లక్ష్మీ దేవి ఆలయం కూడా ఉందని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ ఆలయం 2000 సంవత్సరాల పురాతనమైనది అని నమ్ముతారు. సాధారణంగా లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు లేదా గుడ్లగూబపై కూర్చున్నట్లు దర్శనం ఇస్తుంది. కానీ ఈ ఆలయంలో లక్ష్మీదేవి ఏనుగు వాహనంగా కూర్చుని ఉంది. కనుక ఈ ఆలయాన్ని గజలక్ష్మీ దేవి ఆలయం అని కూడా అంటారు.

ఇవి కూడా చదవండి

సనాతన ధర్మం మత విశ్వాసం అంటే ఏమిటి?

ఈ ఆలయం నమ్మకం ప్రకారం ద్వాపర యుగానికి సంబంధించినది. మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం కోసం అడవుల్లో సంచరిస్తున్నప్పుడు కుంతీదేవి లక్ష్మీదేవిని పూజించడం ఎలా అని ఆలోచిస్తూ పరధ్యానంలో ఉన్నదని చెబుతారు. తల్లి బాధను చూసిన పాండవులు సహాయం కోసం ఇంద్రుడిని ప్రార్థించారు. ఇంద్రుడు పాండవుల తపస్సుకు సంతోషించి తన వాహనాన్ని ఐరావతం పాండవుల వద్దకు పంపాడు. ఇంద్ర దేవుడి వాహనం పేరు ఏనుగు ఐరావతం. కుంతీదేవి లక్ష్మీదేవిని ఐరావతాన్ని పూజించారు. కుంతీ దేవి భక్తిని, పాండవులు తన పట్ల చూపిస్తున్న భక్తీకి, అంకితభావాన్ని చూసి తల్లి లక్ష్మీ చాలా సంతోషించింది. లక్ష్మీదేవి ఆశీస్సులు పాండవులకు లభించాయి. తర్వాత కాలక్రమంలో తమ రాజ్యాన్ని తిరిగి పొందారు.

ఇవీ ఆలయ ప్రత్యేకతలు

ఈ లక్ష్మీ దేవి ఆలయం కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో భక్తులకు నాణేలు ప్రసాదంగా లభిస్తాయని చెబుతారు. అంతే కాకుండా దీపావళి రోజున ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. దీపావళి రోజున అమ్మవారికి అధిక మొత్తంలో పాలు నైవేద్యంగా పెట్టడమే కాదు 56 రకాల ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయంలో శుక్రవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున చాలా మంది వ్యాపారవేత్తలు ఈ ఆలయానికి వస్తారని ఈ ఆలయం గురించి ఒక నమ్మకం కూడా ఉంది.

విష్ణుమూర్తి అరుదైన విగ్రహం

ఈ ప్రదేశంలో అరుదైన విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంది. ఈ విగ్రహంలో ఆయన దశావతారం రూపంలో కనిపిస్తారు. ఇలాంటి విష్ణుమూర్తి విగ్రహం మరెక్కడా కనిపించదని చెబుతారు. ఈ విగ్రహం నలుపు రంగులో ఉంటుంది. ఇది కూడా దాదాపు 2000 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. ఉజ్జయినికి వచ్చిన వారు ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి