Navratri 2024: దుర్గాదేవి ఏ ఆయుధాలను ధరిస్తుంది? ఎవరు ఏ ఆయుధాన్ని ఇచ్చారు? జీవిత పాఠాలు ఏమిటో తెలుసా

హిందూ మతంలో నవరాత్రి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. నవరాత్రి పండుగను దుర్గాదేవికి అంకితం చేశారు. శారదీయ నవరాత్రులు ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తేదీ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ పండుగ 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండుగలో 9 రోజులు నవదుర్గ అని పిలువబడే దుర్గాదేవి తొమ్మిది విభిన్న రూపాలకు అంకితం చేయబడింది. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దుర్గదేవి శక్తిస్వరూపిణి. శక్తి, బలం, చెడుపై మంచి విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

Surya Kala

|

Updated on: Sep 27, 2024 | 3:08 PM

దుర్గాదేవి వివిధ విగ్రహాలు, చిత్ర పటాలను మనం చూస్తే అమ్మవారు రకరకాల ఆయుధాలను ధరించి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఆయుధాలు వారి శక్తికి చిహ్నంగా మాత్రమే కాకుండా లోతైన మతపరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. దుర్గాదేవిని శక్తికి అధిష్టానం దేవతగా పరిగణిస్తారు. ఆమె ధరించే ఆయుధాలు ఆమె శక్తికి చిహ్నంగా మాత్రమే కాదు.. దుర్గామ్మకు వివిధ దేవీ దేవతలు ఇచ్చిన బహుమతులు కూడా.(gettyimages)

1 / 12
 
వేద పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3 న అర్ధరాత్రి 12.19 గంటలకు ప్రారంభమై..  మరుసటి రోజు అక్టోబర్ 4 తెల్లవారుజామున 2.58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శారదీయ నవరాత్రులు గురువారం, అక్టోబర్ 3, 2024 నుండి ప్రారంభమవుతాయి. ఈ పండుగ అక్టోబర్ 12, 2024 శనివారం ముగుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు దుర్గాదేవి ప్రధాన ఆయుధాలు..వాటిని ఎవరు ఇచ్చారో తెలుసుకుందాం.. (gettyimages)

2 / 12
త్రిశూలం: ఇది దుర్గాదేవి అతి ముఖ్యమైన ఆయుధం. శివుడు దీనిని దుర్గాదేవికి కానుకగా ఇచ్చాడు. త్రిశూలం మూడు శక్తులకు చిహ్నంగా పరిగణించబడుతుంది. సృష్టి, నిర్వహణ, విధ్వంసానికి గుర్తు(gettyimages).

3 / 12
సుదర్శన చక్రం: ఈ సుదర్శన చక్రాన్ని శ్రీ మహా విష్ణువు దుర్గాదేవికి బహుమతిగా ఇచ్చాడు. దుర్గాదేవి ఈ ఆయుధంతో ఎందరో రాక్షసులను సంహరించింది.   (gettyimages)

4 / 12

ఖడ్గం: దుర్గాదేవి ఈ ఖడ్గంతో అనేక మంది రాక్షసులను సంహారం చేసిందని నమ్ముతారు. దుర్గా దేవికి ఈ  ఖడ్గాన్ని వినాయకుడు బహుమతిగా ఇచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.(gettyimages)

5 / 12
విల్లు- బాణం: దుర్గాదేవి ప్రత్యేక ఆయుధాలలో విల్లు , బాణం కూడా ఒకటి. విల్లు , బాణం ఖచ్చితత్వం, శక్తికి చిహ్నంగా పరిగణించబడతాయి. ఈ విల్లు, బాణంను వాయు దేవుడు ఇచ్చాడని నమ్ముతారు.(gettyimages)

6 / 12

గద: దుర్గాదేవి చేతిలో గద్ద పట్టుకుని ఉంటుంది. గద శక్తి, బలానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దుర్గాదేవికి ఈ గదను యమ ధర్మ రాజు ఇచ్చినట్లు పురాణాల కథనం. దీనినే కలానందం అంటారు(gettyimages)

7 / 12

వజ్ర- గంట: దుర్గాదేవి వజ్ర, గంటను ధరిస్తుంది. దుర్గాదేవి ఈ దివ్య గంట శబ్దం, వజ్రంతో అనేక రాక్షసులను సంహరించింది. ఈ ఆయుధాలను దుర్గాదేవికి దేవతల అధినేత ఇంద్రుడు ఇచ్చాడు.(gettyimages)

8 / 12
శంఖం: దుర్గా దేవి తన చేతుల్లో దివ్య శంఖాన్ని కలిగి ఉంటుంది. దుర్గాదేవి ఈ శంఖం ధ్వనితో మూడు లోకాలనూ కంపించేలా చేసింది. ఈ శంఖం శబ్దం వల్లనే రాక్షస సైన్యం కకావికలం అయింది.  ఈ దివ్య శంఖాన్ని వరుణ భగవానుడు తల్లి జగదాంబకు సమర్పించాడు

9 / 12
శక్తి దివ్యాస్త్రం: ఈ దివ్యమైన ఆయుధాన్ని అగ్నిదేవుడు దుర్గామాతకు అందించాడు. దుర్గాదేవి మహిషాసురునితో భీకర యుద్ధం చేసినప్పుడు దుర్గామాత ఈ దివ్య ఆయుధాన్ని ప్రయోగించింది.(gettyimages)

10 / 12
గొడ్డలి:  విశ్వకర్మ భగవానుడు బహుమతిగా అందించాడు. ఇది జీవించడానికి పని చేసి..  సంపాదించే శక్తిని సూచిస్తుంది.(gettyimages)

11 / 12
కమలం- కమండలం: బ్రహ్మ దేవుడు కమలం, కమండలాన్ని దుర్గాదేవికి బహుమతిగా ఇచ్చాడు. స్వచ్ఛతను ఒకరికొకరుగా జీవించాలని అనే విషయాలు సూచిస్తాయి. (gettyimages)

12 / 12
Follow us