Lord Shani Puja: ఈ రోజు సాయంత్రం ఇలా చేయడం వలన శనీశ్వరుడి అనుగ్రహం మీ సొంతం..

శనీశ్వరుడి చెడు దృష్టి ఎవరిపై పడితే అతని జీవితం కష్టాలు, నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుదని అంటారు. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అటువంటి పరిస్థితిలో శనివారం చేసే పనుల విషయంలో అనేక నియమనిబంధనలున్నాయి. కొన్ని రకాల పనులు శనివారం చేయకూడదు అని చెప్పారు. శనీశ్వరుడి ఆశీస్సులు మీపై ఉండాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ విషయాలను అవలంభిస్తే శనీశ్వరుడి అనుగ్రహం మీపై కురుస్తుంది. కష్టాలు తొలగిపోతాయి. ఆ ఐదు పరిహారాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Lord Shani Puja: ఈ రోజు సాయంత్రం ఇలా చేయడం వలన శనీశ్వరుడి అనుగ్రహం మీ సొంతం..
Lord Shani Dev
Follow us

|

Updated on: Sep 28, 2024 | 2:38 PM

హిందూమతంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. శనివారం చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు శనీశ్వరుడికి అంకితం చేసిన రోజు. శనివారం రోజున చేసే పూజకు కఠినమైన నియమాలు కూడా ఉన్నాయి. శనీశ్వరుడి చెడు దృష్టి ఎవరిపై పడితే అతని జీవితం కష్టాలు, నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుదని అంటారు. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అటువంటి పరిస్థితిలో శనివారం చేసే పనుల విషయంలో అనేక నియమనిబంధనలున్నాయి. కొన్ని రకాల పనులు శనివారం చేయకూడదు అని చెప్పారు. శనీశ్వరుడి ఆశీస్సులు మీపై ఉండాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ విషయాలను అవలంభిస్తే శనీశ్వరుడి అనుగ్రహం మీపై కురుస్తుంది. కష్టాలు తొలగిపోతాయి. ఆ ఐదు పరిహారాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

రావి చెట్టుకు నీరు అందించండి

ఈ రోజు రావి చెట్టుకు నీరు సమర్పిస్తే మేలు జరుగుతుంది. అంతేకాదు రావి చెట్టుకు నీరు సమర్పించిన తర్వాత చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణ చేయండి. ఈ రోజున దానధర్మాలు చేయడం కూడా ప్రయోజనకరం. పేదవాడికి ఆహారాన్ని అందించండి.

శనీశ్వరుడిని పూజించండి

శనివారం రోజున శనీశ్వరుడి హృదయపూర్వకంగా ఆరాధించండి. నియమాలను పాటించండి. తప్పులు చేయకుండా దూరంగా ఉండండి. పూజ సమయంలో శనీశ్వరుడికి నీలిరంగు పువ్వులు సమర్పిస్తే.. శనీశ్వరుడి కూడా సంతోషిస్తాడు.

ఇవి కూడా చదవండి

నువ్వుల నూనె దానం చేయండి

ఈ రోజు నువ్వులు లేదా ఆవనూనె దానం చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది. నియమాల ప్రకారం పూజ చేస్తే మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. తర్వాత ఒక గిన్నెలో ఆవాల నూనె తీసుకోండి. ఆ నూనెలో మీ ముఖాన్ని చూసుకుని ఆపై ఎవరికైనా అవసరమైన వారికి దానం చేయండి. దీనితో శని దోషం నుండి ఉపశమనం పొందవచ్చు.

బజరంగబలిని పూజించండి

శనివారం బజరంగబలిని పూజించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున స్నానం చేసి హనుమంతుడిని పూజించి, ఆయనకు సింధూరం సమర్పించండి. హనుమంతునికి బెల్లం, మల్లె పువ్వుల నూనె సమర్పించండి. ఆ తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడిని పూజించడం వల్ల శనీశ్వరుడి ఆగ్రహం నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఈ మంత్రాన్ని జపించండి

శనివారం రోజున కొన్ని ప్రత్యేక మంత్రాలను పఠించడం కూడా ప్రయోజనకరం. ఈ రోజున శనీశ్వరుడిని పూజించడంతో పాటు, ‘ఓం శనిశ్చరాయ నమః’ అని 108 సార్లు జపించడం వలన శనిశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. కష్టాల నుండి విముక్తి పొందుతాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే