Devaragattu: దేవరగట్టు కర్రల సమరానికి మూహూర్తం ఖరారు..! ఏయే రోజున ఎలా ఉండనుంది..?

మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కల్యాణం నిర్వహించిన అనంతరం.. కర్రల సమరం జరపడం ఇక్కడ ఆనవాయితీ. ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. ప్రతీ ఏటా నిర్వహించే ఈ వేడుకకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ యేడు కూడా హోలగుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దసరా బన్ని ఉత్సవాలకు ముహూర్తం ఖరారు చేశారు వేదపండితులు.

Devaragattu: దేవరగట్టు కర్రల సమరానికి మూహూర్తం ఖరారు..! ఏయే రోజున ఎలా ఉండనుంది..?
Devaragattu Banni Festival
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 28, 2024 | 1:28 PM

దసరా.. పండగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సహంగా జరుపుకుంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని దేవరగట్టులో మాత్రం దసరా ఉత్సవాలను విభిన్నంగా జరుపుకుంటారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ కర్రల సమరం సాగిస్తారు. పండగ పూట ప్రజలు నెత్తురు చిందిస్తారు. విజయదశమి పండుగ నాడు అర్ధరాత్రి దేవరగట్టులో కర్రల సమరం ఉత్సవంగా జరుగుతుంది. మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కల్యాణం నిర్వహించిన అనంతరం.. కర్రల సమరం జరపడం ఇక్కడ ఆనవాయితీ. ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. ప్రతీ ఏటా నిర్వహించే ఈ వేడుకకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ యేడు కూడా హోలగుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దసరా బన్ని ఉత్సవాలకు ముహూర్తం ఖరారు చేశారు వేదపండితులు.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

– అక్టోబర్‌ 7వ తేది ఉదయం నెరినికి గ్రామంలో స్వామి వార్ల ఉచ్చవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు

ఇవి కూడా చదవండి

– పూజల అనంతరం దేవరగట్టుకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల మధ్యలో ఉత్సవ విగ్రహాలు పయనం ఉంటుంది.

– దేవరగట్టులో పూజల అనంతరం కంకనాథరణం జరుగుతుంది.

– దసరా పండుగ రోజు 12వ తేది రాత్రి బన్ని ఉత్సవం కర్రల సమరం జరగనుంది.

– 13వతేది ఉదయం ఆలయ పూజారి దైవవాణి కార్యక్రమం నిర్వహిస్తారు.

– 14 వతేది సాయంత్రం స్వామి వార్ల రథోత్సవం ఉంటుంది.

– 15 వతేది ఉదయం స్వామి వారి కళ్యాణ కట్ట ముందు గొరవయ్యాల నృత్యాలు

– 16 వ తేది కొండ నుంచి ఉత్సవల విగ్రహాలు నెరినికి, తండా, కొత్తపేట గ్రామాల భక్తుల నడుమ ఊరేగిపుగా చేరే కార్యక్రమం

దరసరా సందర్బంగా దేవరగట్టులో జరిగే బన్ని ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ కమిటీ నిర్వాహకులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..