Bade Hanuman Temple: ఇక్కడ శయన హనుమంతుడి దర్శనం చేసుకోకపోతే గంగా స్నాన ఫలితం దక్కదట.. ఎందుకంటే

అంజనీ పుత్రుడిని హృదయపూర్వకంగా ఆరాధించడం ద్వారా ప్రజల ఉద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయి. వాస్తవానికి దేశవ్యాప్తంగా హనుమంతుడుకి సంబంధించిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇవి హనుమంతుడు విగ్రహం లేదా స్థల విశిష్టతో ప్రసిద్ధి చెందాయి. నిలబడిన హనుమంతుడు విగ్రహం, లేదా కూర్చున్న హనుమంతుడి విగ్రహం వంటి ఆలయాల గురించి తెలుసు. అయితే శయనించి ఉన్న హనుమంతుని ఆలయాలు మాత్రం అతి తక్కువ మాత్రమే ఉన్నాయి. వాటిల్లో ఒకటి ప్రయాగ్ రాజ్ లో ఉంది. 

Bade Hanuman Temple: ఇక్కడ శయన హనుమంతుడి దర్శనం చేసుకోకపోతే గంగా స్నాన ఫలితం దక్కదట.. ఎందుకంటే
Bade Hanuman Temple Prayagraj
Follow us

|

Updated on: Sep 24, 2024 | 5:41 PM

రామ భక్త హనుమంతుడు ప్రతి ఒక్కరికీ ఇష్టమైన దైవం. హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన దేవుడుగా పరిగణించబడుతున్నాడు. మంగళవారం రామ భక్తుడైన హనుమంతునికి అంకితమైనది రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున బజరంగబలిని ఆరాధించడం ద్వారా వ్యక్తి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని. అనేక విషయాలలో ప్రయోజనాలను పొందుతాడని చెబుతారు. అంజనీ పుత్రుడిని హృదయపూర్వకంగా ఆరాధించడం ద్వారా ప్రజల ఉద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయి. వాస్తవానికి దేశవ్యాప్తంగా హనుమంతుడుకి సంబంధించిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇవి హనుమంతుడు విగ్రహం లేదా స్థల విశిష్టతో ప్రసిద్ధి చెందాయి. నిలబడిన హనుమంతుడు విగ్రహం, లేదా కూర్చున్న హనుమంతుడి విగ్రహం వంటి ఆలయాల గురించి తెలుసు. అయితే శయనించి ఉన్న హనుమంతుని ఆలయాలు మాత్రం అతి తక్కువ మాత్రమే ఉన్నాయి. వాటిల్లో ఒకటి ప్రయాగ్ రాజ్ లో ఉంది.

ఈ ఆలయం ఎక్కడ ఉంది?

ఈ ఆలయం భారతదేశ రాజధాని ఢిల్లీకి 700 కిలోమీటర్ల దూరంలో ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ నగరంలో సంగం ఒడ్డున ఉంది. అలహాబాద్‌ను ఇప్పుడు ప్రయాగ్‌రాజ్ అని పిలుస్తున్నారు. ఆలయం గురించి చెప్పాలంటే ఇది బడే హనుమాన్ ఆలయం (బేడీ ఆంజనేయ స్వామి) పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. గంగాస్నానం చేయడానికి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ హనుమాన్ ఆలయాన్ని కూడా తప్పక సందర్శించాలని ఈ ఆలయానికి సంబంధించిన విశ్వాసం. ఇలా చేయకపోతే త్రివేణి సంగమంలోని గంగా స్నానం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.

ఆలయానికి సంబంధించిన పురాణం నమ్మకం ఏమిటంటే

హనుమంతుని పునర్జన్మపై ఆధారపడిన ఈ ఆలయానికి సంబంధించి ఒక పౌరాణిక నమ్మకం ఉంది. హనుమంతుడు లంకను జయించి.. రాక్షసుల వధ తర్వాత వృద్ధాప్యం చాయలకు చేరుకుంటున్నాడు. అప్పుడు సీత దేవి హనుమంతుడి వెన్నె నిమిరి కొత్త జన్మనిచ్చి.. హనుమంతుడికి అమరత్వం అనే వరం ఇచ్చిందని చెబుతారు. హనుమంతుడికి జానకి దేవి చిరంజీవి అనే వరం ఇచ్చిన ప్రదేశం ఇదేనని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి చాలా గుర్తింపు ఉంది. శయన హనుమంతుడి విగ్రహాన్ని చూసిన ఎవరైనా సరే విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుందని భావిస్తారు.

ఇవి కూడా చదవండి

గంగా నది స్నానం ఫలితం దక్కాలంటే ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందే..

ఈ ప్రదేశంలో ఉన్న హనుమంతునికి సీతా దేవి ఓ వరాన్ని ఇచ్చింది. త్రివేణీ సంగమం గంగా తీరాన స్నానానికి ఎవరు వచ్చినా ఈ ఆలయాన్ని కూడా దర్శించాలి. అప్పుడే గంగా నది పుణ్యస్నానం ఫలితం భక్తులకు దక్కుతుందని సీతాదేవి చెప్పింది. అప్పటి నుంచి గంగలో స్నానం చేసిన తర్వాత బజరంగబలిని సందర్శించే సంప్రదాయం కొనసాగుతుంది. అలాగే, ఈ ఆలయానికి ఎవరు వెళ్ళినా హనుమంతుడికి సిందూరాన్ని సమర్పిస్తారు. ఇలా చేయడం వలన భజరంగబలి సంతోషిస్తాడని భక్తులపై తన ఆశీస్సులను అందిస్తాడని నమ్మకం. ఈ అద్భుత దేవాలయం మంగళ, శనివారాల్లో చాలా రద్దీగా ఉంటుంది. ఈ ఆలయంలో ఎవరైతే వ్రతం చేస్తారో వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి