- Telugu News Photo Gallery If these things are in the bedroom, there will be quarrels between husband and wife, Check Here is Details
Vastu Tips: బెడ్‌రూమ్‌లో ఈ వస్తువులు ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఖాయం!
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మిస్తే ఎలాంటి సమస్యలు రావని విశ్వసిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించినా.. కూడా మనం ఇంట్లో పెట్టుకునే వస్తువుల వలన కూడా వాస్తు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా బెడ్‌రూమ్‌లో పెట్టుకునే వస్తువుల వలన కూడా కొన్ని సమస్యలు ఏర్పడతాయి. దీని వలన దంపతుల మధ్య కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. దేవుడికి సంబంధించిన ఫొటోలు, విగ్రహాలు లాంటివి బెడ్ రూమ్ గదిలో అస్సలు పెట్టకూడదు. ఇలా బెడ్ రూమ్‌లో పెట్టడం వల్ల తీవ్రమైన అపచారం..
Updated on: Sep 24, 2024 | 4:54 PM

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మిస్తే ఎలాంటి సమస్యలు రావని విశ్వసిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించినా.. కూడా మనం ఇంట్లో పెట్టుకునే వస్తువుల వలన కూడా వాస్తు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా బెడ్‌రూమ్‌లో పెట్టుకునే వస్తువుల వలన కూడా కొన్ని సమస్యలు ఏర్పడతాయి. దీని వలన దంపతుల మధ్య కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి.

దేవుడికి సంబంధించిన ఫొటోలు, విగ్రహాలు లాంటివి బెడ్ రూమ్ గదిలో అస్సలు పెట్టకూడదు. ఇలా బెడ్ రూమ్‌లో పెట్టడం వల్ల తీవ్రమైన అపచారం చేసినట్లు అవుతుంది. దీని వలన వాస్తు దోషం ఏర్పడుతుంది. దీని వలన కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వస్తాయి.

ఇంట్లో పాడైపోయిన లేదా కాలిపోయిన ఎలక్ట్రిక్ పరికరాలను కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. దీని వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దీని వలన మన ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది.

జలపాతాలకు, సముద్రాలకు చెందిన ఫొటోలు, పెయింటింగ్స్ కూడా బెడ్ రూమ్‌లో పెట్టకూడదు. దీని వలన కూడా భార్యాభర్తల మధ్య గొడవలు, కలహాలు ఏర్పడతాయి.

అంతే కాకుండా బెడ్ రూమ్‌లో బెడ్‌కు ఎదురుగా కూడా పెట్టకూడదు. అలాగే ఉదయాన్నే లేచి అద్దంలో ముఖం చూడకూడదు. బెడ్‌రూమ్ లోపలి గోడలకు రంగు డార్క్ కలర్ ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల దంపతుల మధ్య గొడవలు వస్తాయి.




