AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mysore Dasara: మైసూర్ దసరా ఉత్సవాలకు వెళ్ళాలనుకుంటున్నారా.. ప్రధాన ఆకర్షణలు ఇవే.. చూడడం మిస్ అవకండి..

దసరా పండగ వస్తుందంటే చాలు అందరి కళ్ళు మైసూర్ దసరా ఉత్సవాల వైపే.. అలనాటి రాజుల వైభవాన్ని కనుల ముందుకు తీసుకొస్తాయి మైసూర్ దసరా ఉత్సవాలు. ఇక్కడ ఉత్సవాలు చాలా అందంగా హిందూ సంప్రదాయానికి ప్రతీకగా ఉంటాయి. కర్ణాటకలోని సాంస్కృతిక నగరమైన మైసూర్‌లోని దసరా విజయనగర కాలం నాటి చరిత్రను కలిగి ఉంది. ఇక్కడ ఉత్సవాలు ఎల్లప్పుడూ ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. పది రోజుల పాటు జరిగే ఈ దసరా ఉత్సవాలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశీయులు సైతం ఏటా లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. మీరు కూడా దసరా ఉత్సవాలను చూడటానికి మైసూర్‌ని సందర్శించాలనుకున్నట్లు అయితే ఈ కొన్ని షోలను మిస్ చేసుకోకండి.

Surya Kala
|

Updated on: Sep 24, 2024 | 6:37 PM

Share
జంబూ రైడ్: మైసూర్ దసరా ప్రధాన ఆకర్షణ అద్భుతమైన జంబూ రైడ్. నవరాత్రుల పదో రోజున ప్రధాన ఏనుగు 750 కిలోల బరువున్న శ్రీచాముండేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించిన బంగారు అంబరీని తీసుకువెళుతుంది. వందలాది ఏనుగులు బంగారు పూతతో కూడిన దుస్తులు ధరించి మైసూర్ వీధుల్లో ఊరేగడం కనుల పండువగా ఉంటుంది. ఈ ఊరేగింపు దసరా పండుగకు మరింత శోభను చేకూరుస్తుంది.

1 / 6
మైసూర్ ప్యాలెస్: మైసూర్ సాంస్కృతిక రాజధాని అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ప్యాలెస్. దసరా సందర్భంగా ప్యాలెస్ విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతుంది. వేలాది బల్బులతో అలంకరించుకుంటుంది మైసూర్ ప్యాలెస్. రాత్రి వేళల్లో ఈ దీపాల అలంకరణతో ఉన్న ప్యాలెస్ ను చూస్తుంటే కనుల విందు కలుగుతుంది.

2 / 6
ఫుడ్ ఫెయిర్స్, గొంబే ఫెస్టివల్: దసరా సందర్భంగా మైసూర్‌ని సందర్శించే ఆహార ప్రియులు రుచికరమైన స్థానిక ఆహారాలు, స్వీట్‌లతో సహా వివిధ రకాల రుచికరమైన ఆహారాలను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా మైసూర్‌లో జరిగే బొమ్మల పండుగ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. వివిధ స్థానిక కళాకారులచే రూపొందించబడిన వివిధ తోలుబొమ్మలు, బొమ్మలు ప్రదర్శనలో ఉంటాయి.

3 / 6
కుస్తీ, తోలుబొమ్మల ప్రదర్శనలు: కర్ణాటక సంస్కృతిలో భాగమైన జట్టి పోరాటాన్ని మైసూర్‌లో చూడవచ్చు. ఇది విజయనగర కాలంలో రాజులతో పాటు స్థానికులకు ముఖ్యమైన ప్రదర్శన. నేటికీ కొనసాగుతోంది. మల్లయోధులు కుస్తీలు చూసేందుకు ఇదే మంచి సమయం.

4 / 6

సాంస్కృతిక కార్యక్రమాలు: దసరా సందర్భంగా పది రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దసరా సందర్భంగా మైసూర్‌కు వస్తే సినీ కళాకారులతో పాటు వివిధ రంగాలకు చెందిన కళాకారులు వచ్చి సంగీతం, నృత్యం, వివిధ కళలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

5 / 6
Mysore Dasara 2024 5

Mysore Dasara 2024 5

6 / 6