- Telugu News Photo Gallery Spiritual photos Navaratri 2024: edupayala vana durga bhavani dussehra celebrations know total details
Navaratri 2024: శరన్నవరాత్రికి సిద్ధమవుతున్న ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం.. ఏ రోజున ఏ అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నదంటే
తెలంగాణలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని నాగసానిపల్లిలో గ్రామంలో ఏడు పాయల నదీ ఒడ్డున వెలిసి, వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా క్షేత్రం. 12వ శతాబ్దంలో నిర్మించిన ఏడుపాయలు వన దుర్గా భవానీ ఆలయంలో కనకదుర్గాదేవి పూజలను అందుకుంటుంది. రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం పవిత్ర క్షేత్రం ఈ ఏడాది దసరా ఉత్సవాలకు ముస్తాబవుతుంది.
Updated on: Sep 25, 2024 | 4:42 PM

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధం అవుతుంది..ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు మహశక్తి అవతారంగా దర్శనం యిస్తారు..అక్టోబర్ నెల 3వ తేదీ నుండి12వ తేదీ వరకు ఏడుపాయల వనదుర్గమాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు మొదలు అయ్యాయి..

ఏడుపాయలు ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం..ఈ క్షేత్రం మెదక్ జిల్లా,పాపన్నపేట మండలంలోని నాగ్‌సాన్‌పల్లి వద్ద అడవిలో ఉంది. తొమ్మిది రోజుల పాటు ఏడుపాయల వనదుర్గ మాత ఆలయంలో అంగరంగ వైభవంగా జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవల్లో భాగంగా వన దుర్గభవాని మాత తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వ నుంది.

వనదుర్గ భవాణి మాత దసరా నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు శ్రీశైలపుత్రి (బాలా త్రిపుర సుందరి) అవతారంలో దర్శనం ఇవ్వనున్నది.

దసరా నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు బ్రహాచారిని (గాయత్రీ దేవి)గా వనదుర్గ భవాణి దేవి భక్తులకు దర్శనం ఇవ్వనుంది.

ఏడుపాయల వనదుర్గ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు చంద్ర గంట (అన్నపూర్ణ) అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు.

దసరా నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు అంటే అక్టోబర్ కూష్మాండ (వనదుర్గా)గా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

శరన్నవ రాత్రుల ఉత్సవాల్లో ఐదో రోజు కనక దుర్గాదేవి స్కంద మాత (మహాలక్ష్మి) అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది.

దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఆరో రోజు షష్టి కాత్యాయని (సరస్వతిదేవి)గా ఏడుపాయల వనదుర్గ దేవి దర్శనమివ్వనున్నారు.

ఏడుపాయల వనదుర్గ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు కాల రాత్రి (దుర్గాదేవి)గా భక్తులకు దర్శనం ఇవ్వనుంది.

దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు మహా గౌరీ సిద్ధి రాత్రి (మహిషాసురా మర్ధిని) అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది.

శరదీయ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు తొమ్మిదవ రోజు నవమి, దశమి (విజయదశమి) రాజరాజేశ్వరీదేవీగా ఏడుపాయల వనదుర్గ దేవి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ అవతారాల్లోని అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వెయ్యి కన్నులతో ఎదురుచూస్తున్నరు




