AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఆర్ధిక ఇబ్బందులా.. ఇంట్లో నెమలి ఈకలను ఏ దిశలో పెట్టుకోవడం శుభ ప్రదం అంటే..

భారతీయ సంస్కృతి, సంప్రదాయంలో నెమలి ఈకకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇది అందం, శాంతి, ఆధ్యాత్మికతకు చిహ్నం. అంతేకాదు నెమలి ఈక అదృష్టం, సానుకూల శక్తికి మూలంగా కూడా పరిగణించబడుతుంది. అందుకే నెమలి ఈకను ఇళ్లలో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీని రంగు, ఆకర్షణీయమైన, ప్రత్యేకమైన రూపం నెమలి ఈకను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. అందుకే చాలా మంది నెమలి ఈకను ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడతారు. పురాణ కథల ప్రకారం శ్రీ కృష్ణ భగవానుడి కిరీటంలో నెమలి ఈకలు కూడా కనిపిస్తాయి. ఇది కన్నయ్య దైవత్వం, సరళతను చూపుతుంది.

Surya Kala
|

Updated on: Sep 25, 2024 | 5:50 PM

Share
నెమలి ఈకలను తరచుగా అలంకరణ, పూజలు, సాంస్కృతిక పండుగలలో ఉపయోగిస్తారు. దీంతో నెమలి ఈకలకు ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. అయితే నెమలి ఈకలకు సంబంధించిన కొన్ని రెమెడీస్ కూడా మిమ్మల్ని ధనవంతులుగా మార్చగలవని తెలుసా.. నిజానికి కొన్ని వాస్తు నియమాలను పాటించి ఇంట్లో ఉంచుకుంటే ఇంట్లో సంపద పెరుగుతుంది.

1 / 5
వాస్తు శాస్త్రంలో నెమలి ఈక ప్రాముఖ్యత: వాస్తు శాస్త్రంలో నెమలి ఈకకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. నెమలి ఈకలను సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

2 / 5
నెమలి ఈకలను వాయువ్య దిశలో ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా పిల్లల చదువు గదిలో నెమలి ఈకలు పెట్టాలి. ఇది వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నెమలి ఈక వాస్తు దోషాలను తొలగించి ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది.

3 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం.. నెమలి ఈకలు ఆర్ధిక నివారణలు.. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో కూడా నెమలి ఈకలు ఉపయోగపడతాయి. వాస్తు శాస్త్రంలో నెమలి ఈకలకు సంబంధించిన అనేక నివారణలు చెప్పబడ్డాయి. ఎవరైనా ఆర్దికంగా ఇబ్బంది పడుతుంటే ఆర్ధిక ఇబ్బందులు తీరడానికి నెమలి ఈకలను ఇంటిలో లేదా వ్యాపార స్థలంలో సురక్షితమైన లేదా డబ్బులు పెట్టుకునే స్థానంలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది.

4 / 5
ఉత్తర దిశలో నెమలి ఈకలను ఉంచడం వల్ల వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అలాగే లాభాల అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎవరైనా కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లయితే నెమలి ఈకపై కుంకుమతో “శ్రీ” అని రాసి పూజా స్థలంలో ఉంచండి. ఇంట్లో కూడా భద్రంగా ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వలన సంపద పెరగడంతో పాటు, వాస్తు దోషాలను తొలగించడానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది.

5 / 5