AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓనం సందర్భంగా పూల రంగోలి వేసిన చిన్నారులు.. తన అనుమతి లేదంటూ చెరిపేసిన మహిళ

పుక్కలం అంటే పూల రంగోలి. ఈ పండుగ సందర్భంగా కేరళీయులు తమ సంప్రదాయంలో భాగంగా తమ ఇళ్లలో ఇంటి ఆవరణలో అందమైన పూల రంగోలిని వేస్తారు. అదే విధంగా బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో కేరళకు చెందిన కొందరు చిన్నారులు తమ పండుగ వేడుకల కోసం అందమైన రంగోలిని పూలతో వేశారు. అయితే తన అనుమతి లేకుండా పూల రంగోలి వేసినందుకు ఓ మహిళ ఆ రంగోలిని కాలితో తన్నుతూ చేరిపివేసింది.

Viral Video: ఓనం సందర్భంగా పూల రంగోలి వేసిన చిన్నారులు.. తన అనుమతి లేదంటూ చెరిపేసిన మహిళ
Woman Destroys Onam Pookalam
Surya Kala
|

Updated on: Sep 24, 2024 | 5:11 PM

Share

కేరళ రాష్ట్ర పండగ ఓనం.. కేరళ హిందువులు అత్యంత భక్తీ శ్రద్దలతో జరుపుకునే ఈ ఓనం పండుగ ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో వస్తుంది. కేరళ వాసులు ఎక్కడ ఉన్నా సరే ఈ ఓనం పండగను అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. అయితే ఓనం పండుగలో పుక్కలం ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. పుక్కలం అంటే పూల రంగోలి. ఈ పండుగ సందర్భంగా కేరళీయులు తమ సంప్రదాయంలో భాగంగా తమ ఇళ్లలో ఇంటి ఆవరణలో అందమైన పూల రంగోలిని వేస్తారు. అదే విధంగా బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో కేరళకు చెందిన కొందరు చిన్నారులు తమ పండుగ వేడుకల కోసం అందమైన రంగోలిని పూలతో వేశారు. అయితే తన అనుమతి లేకుండా పూల రంగోలి వేసినందుకు ఓ మహిళ ఆ రంగోలిని కాలితో తన్నుతూ చేరిపివేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళ అసభ్య ప్రవర్తనపై నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

బెంగళూరులోని సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తణిసంద్రలోని మోనార్క్ సెరినిటీ అపార్ట్‌మెంట్‌లో తన అనుమతి లేకుండా చిన్నారులు పూల రంగోలి గీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ మహిళ తన కాలుతో పూల రంగోలిని తన్నింది. ఓనం పండుగ సందర్భంగా కేరళకు చెందిన కొందరు చిన్నారులు తమ అపార్ట్‌మెంట్ ముందు పూల రంగోలి వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన అనుమతి లేకుండా రంగోలి ఎలా గీశారని సిమి నాయర్ అనే మహిళ ఆ రంగోలిని ధ్వంసం చేసి నానా హంగామా సృష్టించింది. అసభ్యంగా ప్రవర్తించింది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

ఈ వీడియో karnakataportf అనే X ఖాతాలో “ఇది నిజంగా సిగ్గుచేటు ప్రవర్తన” అనే శీర్షికతో షేర్ చేయబడింది. వైరల్ వీడియోలో పిల్లలు గీసిన పుక్కలంపై ఒక మహిళ నిలబడి ఉంది. తన పర్మిషన్ లేకుండా ఇక్కడ రంగోలి ఎలా వేశారంటు ఆ అందమైన పూల రంగోలిని తన్ని చెల్లాచెదురు చేసింది. ఇలా చేస్తే తనకు ఏమి చేయాలో తెలుసు అన్నట్లుగా దురుసుగా ప్రవర్తించింది.

సెప్టెంబర్ 22న షేర్ చేసిన ఈ పోస్ట్‌ని 41,000 మంది చూశారు. రకరకాల కామెంట్‌లు చేస్తున్నారు. ఒక వినియోగదారు.. ఓహ్ ఆమె మనస్తత్వంమంచిగా లేదు.. ఆమె మతం, సంప్రదాయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి” అని అన్నారు. మరోకరు ఆమెను, ఆమె కుటుంబాన్ని ముందుగా అపార్ట్‌మెంట్ నుండి తరిమికొట్టాలి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..