Viral News: ఆటో డ్రైవర్ ఐడియా అదుర్స్ గురూ..! ఆటో డ్రైవర్ సీటుని ఆఫీసు కుర్చీతో రీప్లేస్ చేశాడు..
ఇప్పుడు మరో ఆటో డ్రైవర్ క్రియేటివ్ ఐడియాకి సంబందించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఆటో డ్రైవర్ తాను కూర్చునే డ్రైవర్ సీటును ఆఫీస్ చైర్‌గా అప్‌గ్రేడ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎంత ట్రాఫిక్ ఉన్నాసరే ఆటోని హ్యాపీగా నడపడానికి వీలుగా చైర్ ను అప్ గ్రేడ్ చేశాడు. ఆఫీస్ లో కూర్చునే చైర్ లో కూర్చుని ఆటోని హాయిగా నడపడానికి వీలుగా అమర్చి ఉండడం గమనించవచ్చు.
ఇటీవల.. బెంగళూరులోని ఒక ఆటో డ్రైవర్ తన స్మార్ట్ వాచ్‌లో తన UPI QR కోడ్‌ను ఉపయోగించి కస్టమర్ల నుంచి ఆన్‌లైన్ చెల్లింపును అందుకున్న ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. ఇప్పుడు మరో ఆటో డ్రైవర్ క్రియేటివ్ ఐడియాకి సంబందించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఆటో డ్రైవర్ తాను కూర్చునే డ్రైవర్ సీటును ఆఫీస్ చైర్‌గా అప్‌గ్రేడ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ ఆటో డ్రైవర్ ఫోటో @shivaniiiiiii_ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇది సర్వత్రా ఫోటో వైరల్ అయ్యింది. సెప్టెంబర్ 23న షేర్ చేసిన ఈ పోస్ట్‌ను ఒక్కరోజులోనే 76 వేల మందికి పైగా వీక్షించారు. ప్రస్తుతం ఈ ఫోటో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.
వైరల్ పోస్ట్‌ను ఇక్కడ చూడండి:
auto driver’s seat had an office chair fixed for extra comfort, man i love bangalore @peakbengaluru 🤌🏼 pic.twitter.com/D1LjGZOuZl
— Shivani Matlapudi (@shivaniiiiiii_) September 23, 2024
ఎంత ట్రాఫిక్ ఉన్నాసరే ఆటోని హ్యాపీగా నడపడానికి వీలుగా చైర్ ను అప్ గ్రేడ్ చేశాడు. ఆఫీస్ లో కూర్చునే చైర్ లో కూర్చుని ఆటోని హాయిగా నడపడానికి వీలుగా అమర్చి ఉండడం గమనించవచ్చు. ప్రస్తుతం ఈ ఆటో డ్రైవర్ సృజనాత్మక ఆలోచన నెటిజన్లతో ప్రశంసలను అందుకుంటుంది. చాలా మంది కామెంట్స్ ద్వారా తమ అభినందనలు తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..