Tirumala Laddu: శ్రీవారి లడ్డూ అంశంపై సినీ హీరోల మధ్య డైలాగ్ వార్
తిరుమల లడ్డూ విషయంలో నెయ్యి కల్తీపై వైసీపీ నాయకులను తీవ్రంగా విమర్శించన పవన్ కల్యాణ్.. అనంతరం పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రకాశ్‌రాజ్‌తో పాటు, సినిమా యాక్టర్లపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఈ ఇష్యూలో మొదట పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌కి ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు.

అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. హిందూ ధార్మిక సంఘాల నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు. ఏపీలో రాజకీయంగా అట్టుడుకుతోంది. టీడీపీ, వైసీపీ నేతలు ఈపాపం మీదంటే మీదేనంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ అడుగు మందుకేసి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేశారు పవన్ కల్యాణ్. ఈ క్రమంలో వైసీపీ నేతలపైనా, సినీ ప్రముఖులపైనా విమర్శలు గుప్పించారు. నెయ్యి కల్తీపై వైసీపీ నాయకులను తీవ్రంగా విమర్శించన పవన్ కల్యాణ్.. అనంతరం పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రకాశ్‌రాజ్‌తో పాటు, సినిమా యాక్టర్లపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఈ ఇష్యూలో మొదట పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌కి ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ప్రియమైన పవన్ కల్యాణ్, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగింది. నిందితులను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోండి. అంతేకానీ, లేనిపోని భయాలను వ్యాప్తి చేస్తూ జాతీయ స్థాయి సమస్యగా ఎందుకు మారుస్తున్నారు. ఇప్పటికే దేశంలో మతపరమైన ఆందోళనలు ఉన్నాయి అంటూ రెండు రోజుల క్రితం ట్వీట్ చేశారు. ఈ ఎక్స్ వార్‌లో వెంటనే మంచు విష్ణు ఎంటరయ్యారు. పవన్‌కి సపోర్ట్ చేస్తూనే.. ప్రకాశ్ రాజ్‌కి మీ పరిధిలో మీరు ఉండాలంటూ సున్నితంగా వార్న్ చేశారు. మరోవైపు...
