Tirupati Laddu Row: లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. సిట్‌ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి

విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియోగాలు ఆంధ్రప్రదేశ్ తోపాటు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ అంశం ఇటు రాజకీయంగానూ చినికి చినికి గాలివానగా మారింది.. కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి..

Tirupati Laddu Row: లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. సిట్‌ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి
Tirupati Laddu Row
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 24, 2024 | 8:58 PM

విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియోగాలు ఆంధ్రప్రదేశ్ తోపాటు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ అంశం ఇటు రాజకీయంగానూ చినికి చినికి గాలివానగా మారింది.. కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. ఈ క్రమంలో నిజాలు నిగ్గుతేల్చేందుకు చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ వివాదంపై మంగళవారం సిట్‌ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ను ఏర్పాటు చేసింది.. సిట్‌ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది.. ప్రస్తుతం త్రిపాఠి గుంటూరు రేంజ్‌ ఐజీగా ఉన్నారు. సిట్ సభ్యులుగా గోపినాథ్‌జెట్టి, హర్షవర్ధన్‌రాజును నియమించారు. ప్రస్తుతం గోపినాథ్‌జెట్టి విశాఖ డీఐజీగా ఉండగా.. హర్షవర్ధన్‌రాజు కడప ఎస్పీగా ఉన్నారు. సిట్ తిరుమలలో ఆవు నెయ్యి కొనుగోలు, టెండర్లపై దర్యాప్తు చేయనుంది.. కల్తీ నెయ్యి సరఫరా వెనుక కారణాలపై ఆరాతోపాటు.. AR డెయిరీ క్రెడిబిలిటీ, కంపెనీపై గతంలో వచ్చిన ఆరోపణలపై విచారణ చేయనుంది.. కాంట్రాక్ట్‌ ఇవ్వడంలో అవకతవకలు జరిగాయా అనేదానిపై కూడా దర్యాప్తుచేయనుంది.. టీటీడీతో AR డెయిరీ లావాదేవీలు, సిట్‌ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోనుంది..

పలు పేర్లను పరిశీలించిన చంద్రబాబు..

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఇవాళ సిట్‌ టీమ్ ఏర్పాటుకు ముందు సీఎం చంద్రబాబు చాలా కసరత్తు చేశారు. సిట్ టీమ్ ఏర్పాటుపై నిన్న డీజీపీతో కూడా చర్చించారు. సిట్‌ చీఫ్‌గా SEB డైరెక్టర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికాంత్‌, టెక్నికల్‌ సర్వీసెస్‌ ఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ, లా అండ్‌ ఆర్డర్‌ ఐజీ శ్రీకాంత్‌ పేర్లను పరిశీలించి… చివరకు త్రిపాఠి పేరు ఖరారు చేశారు.

వైసీపీ నేతలు ఏమంటున్నారంటే..

అయితే సిట్‌ వద్దంటే వద్దంటూ వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. సిట్ పై తమకు నమ్మకం లేదంటున్నారు. సీబీఐతో విచారణ చేయించాలని లేదా సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని వైసీపీ నేతలు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..